కేరళ స్టోరీ : హీరోయిన్ ని చంపేస్తామని బెదిరింపులు, ఇంతలో యాక్సిడెంట్‌

Update: 2023-05-15 11:58 GMT
ఇటీవల మీడియాలో ది కేరళ స్టోరీ గురించి అనేక కథనాలు వస్తున్నాయి. విడుదల అయిన తక్కువ రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన ఈ చిత్రానికి ఒక వైపు వసూళ్లు పెరుగుతూ ఉంటే మరో వైపు వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అదా శర్మ ను చంపేస్తామంటూ కొందరు హెచ్చరించారు.

తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న 'ది కేరళ స్టోరీ' సినిమా లో నటించిన అదా శర్మను మరియు ఇతర యూనిట్‌ సభ్యులను భౌతికంగా దాడి చేసి చంపేస్తాం అంటూ కొందరు హెచ్చరిస్తూ సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్‌ గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే అనూహ్యంగా చిత్ర యూనిట్‌ సభ్యులు యాక్సిడెంట్‌ కి గురి అయ్యారు.

ది కేరళ స్టోరీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రయాణాలు చేస్తున్న యూనిట్‌ సభ్యుల వాహనంకు యాక్సిడెంట్‌ అయ్యిందట.

అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని హీరోయిన్ అదా శర్మ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.

హీరోయిన్ అదా శర్మ ట్విట్టర్ లో... నేను బాగానే ఉన్నాను. ఈ విషయం గురించి నేను చాలా మెసేజ్‌ లు అందుకుంటున్నాను. మొత్తం మీమ్ మెంబర్స్ బాగానే ఉన్నాం. పెద్ద ప్రమాదం ఏమీ కాదు.. పెద్ద సీరియస్ కాదు. మా గురించి సానుభూతి తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అంటూ అదా శర్మ పేర్కొంది.

యాక్సిడెంట్ వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే దిశగా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందని కొందరు డిమాండ్ చేస్తున్నారు. యాక్సిడెంట్‌ జరిగిన నేపథ్యంలో చంపేస్తాం అంటూ బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

Similar News