రెండు కోట్లివ్వండి.. మంచి సినిమా చేసి పెడతానంటూ రెండేళ్ల కిందట దిల్ రాజును కలిశాడట డైరెక్టర్ సాయికిరణ్ అడివి. ఐతే కేరింత సినిమా పట్టాలెక్కడానికి ముందే దాదాపు రెండు కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పాడు దిల్ రాజు. ఓ కథ అనుకుని.. కొంతమంది నటీనటులతో సినిమా మొదలుపెట్టడం.. ఆ తర్వాత ఆ కథ నచ్చక మళ్లీ సిట్టింగ్స్ వేసి కొత్త కథ తయారు చేసి కొత్త నటీనటులతో సినిమా మొదలుపెట్టడం వల్ల అయ్యిన అదనపు ఖర్చు ఇది. ఐతే ఆ ఎక్స్‌ట్రా ఖర్చు, తర్వాత సినిమా మీద పెట్టిన పెట్టుబడి కలిపి వసూలు చేసేట్లే ఉంది 'కేరింత'.
మొదట్లో ఏవరేజ్ టాక్‌తో మొదలైనా.. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేకున్నా.. నెమ్మదిగా బాగానే పుంజుకుంది కేరింత. పోటీగా విడుదలైన 'జ్యోతిలక్ష్మీ', తర్వాతి వారం వచ్చిన కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ లాంటి సినిమాలు డల్ అయిపోయాయి కానీ.. 'కేరింత' మాత్రం ఇప్పటికీ బాగానే ఆడుతోంది. రెండు వారాల్లో ఈ సినిమా ఐదున్నర కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. తాను అనుకున్న స్థాయికి బయ్యర్స్ రాకపోవడంతో దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సొంతంగా సినిమాను విడుదల చేసి రిస్క్ తీసుకున్నాడు. ఆ రిస్క్ వల్ల అతడు కోల్పోయిందేమీ లేదు. అమ్మాలనుకున్న దాని కంటే ఎక్కువ డబ్బులే వచ్చాయి. బాహుబలి వచ్చేవరకు ఇంకా కలెక్షన్లు రాబట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఫుల్ రన్‌లో 'కేరింత' ఏడు కోట్ల దాకా వసూలు చేసే అవకాశముంది. అన్ని లెక్కలూ చూసుకుంటే దిల్ రాజు బ్రేక్ ఈవెన్‌కు వచ్చేయబోతున్నట్లే కనిపిస్తోంది.