తండ్రిని మించిపోతున్న కుర్ర హీరో

Update: 2019-10-01 01:30 GMT
టాలీవుడ్ కి పూరి తనయుడిగా పరిచయమైన హీరో ఆకాష్ పూరి ప్రస్తుతం 'రొమాంటిక్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి అందించిన కథ-మాటలతో అనీల్ అనే డెబ్యూ డైరక్టర్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ వదిలారు. టైటిల్ కి తగ్గట్టే కాస్త రొమాంటిక్ టచ్ ఎక్కువగా వచ్చి ఓ హాగ్ పోస్టర్ ను ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేసారు.

అయితే ఇప్పుడీ పోస్టర్ హాట్ టాపిక్ గా మారింది. ఆకాష్ పూరి - కేతికా శ‌ర్మ‌ ఇద్దరూ కలిసి బిగి కౌగిలితో ఉన్న ఈ స్టిల్ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. పైగా హీరోయిన్ బ్యాక్ సైడ్ నుండి టాప్ లెస్ గా కనిపించడం చర్చనియంశం అయింది. ఇప్పుడే ఈ కుర్ర హీరోకి ఈ డోస్ అవసరమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. ఇంకో వైపు పోస్టర్ చూసిన నెటిజర్లు ఇది రొమాన్స్  కాదు బాబు సెక్స్ అంటూ ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో తండ్రిను కూడా మించిపోయాడే అంటున్నారు.

నిజానికి ఈ సినిమాతో ఆకాష్ ను హీరోగా నిలబెట్టాలన్నది పూరి అండ్ టీం టార్గెట్. అందుకే కథలో ఉన్నదానికంటే ఇంకాస్త రొమాన్స్  డోస్ పెంచి బూతు డైలాగ్స్ కూడా పెట్టారట. ప్రస్తుతం టాలీవుడ్ లో బూతు సినిమాల్ ట్రెండ్ నడుస్తుంది. అడల్ట్ రొమాంటిక్ సినిమాలకు ఆడియన్స్ ఎక్కువ ఎట్రాక్ట్ అవుతున్నారు. అందుకే 'ఇస్మార్ట్ శంకర్' లో కూడా ఆ డోస్ ఎక్కువైంది. ఇప్పుడు ఆకాష్ సినిమాకు కూడా అదే చేస్తున్నారు.ఇక 'ఇస్మార్ట్ శంకర్' తో నిర్మాతగా లాభాలు అందుకున్న పూరి అండ్ చార్మీ ఈ సినిమాతో కూడా భారీ కలెక్షన్స్ రాబట్టాలని చూస్తున్నారట. బిజినెస్ కూడా భారీగానే చేసే ప్లాన్ లో ఉన్నారట. మరి ఈ అడల్ట్ కంటెంట్ తో పూరి కొడుకు ఎలాంటి హిట్టు కొడతాడో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.
    

Tags:    

Similar News