కేజీఎఫ్‌ 'అధీరా' మేకప్‌ సంగతులు

Update: 2021-01-09 14:30 GMT
ప్రస్తుతం యావత్ దేశ సినీ అభిమానులు కేజీఎఫ్‌ గురించి మాట్లాడుకుంటున్నారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే కేజీఎఫ్‌ 2 టీజర్‌ వంద మిలియన్‌ ల వ్యూస్ తో కుమ్మేస్తుంది. ఏ బాలీవుడ్‌ మూవీ కాని ఏ ఇతర భాష సినిమా కాని ఈ రేంజ్ లో వ్యూస్‌ దక్కించుకున్న దాఖలాలు లేవు. ఇండియాలో సినీ అభిమానులు కేజీఎఫ్‌ 2 గురించి ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో ఈ టీజర్‌ వ్యూస్‌ తో తేలిపోయింది. కేజీఎఫ్ 2 అంటే కేవలం యశ్‌ మాత్రమే కాకుండా సంజయ్‌ దత్ కూడా. అందుకే ఈ సినిమా బాలీవుడ్‌ రేంజ్ లో క్రేజ్ ను కలిగి ఉంది. ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ అధీరా పాత్రలో నటిస్తున్నాడు. మొదటి పార్ట్‌ లోనే అధీరా పాత్రకు సంబంధించిన పరిచయం ఇచ్చారు. కాని పాత్రను మాత్రం పరిచయం చేయలేదు.

అధీరా అంటే అత్యంత భయంకరమైన వ్యక్తి. అతి బల పరాక్రమవంతుడు మరియు అతి భయంకరుడు గా చూడగానే కనిపించాలి. కనుక సంజయ్‌ దత్‌ కు అత్యంత జాగ్రత్తగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ మేకప్ వేయడం జరిగింది. సంజయ్‌ దత్‌ షూటింగ్‌ లో పాల్గొనాలంటే దాదాపుగా గంట నుండి గంటపావు వరకు మేకప్‌ కు సమయం కేటాయించేవారట. ప్రతి ఒక్క డీటైల్ ను తీసుకు వచ్చేందుకు ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా క్రూరుడుగా అనిపించేలా వి కింగ్స్ వారియర్ రోల్‌ ను ఇన్సిపిరేషన్‌ గా తీసుకుని డిజైన్‌ చేయడం జరిగింది. ప్రతి రోజు గంట పాటు ఎంతో ఓపికగా మేకప్‌ వేయించుకోవడంతో పాటు అంత మేకప్ తో నటించడం అన్నా కూడా చాలా కష్టం. అంతటి కష్టంను సంజయ్ దత్ భరించాడు కనుక ఖచ్చితంగా కేజీఎఫ్ 2 లో ఆయన పాత్ర అద్బుతం అన్నట్లుగా ఉంటుందనే నమ్మకం ను ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News