'కేజీఎఫ్-2' ఆ రేంజిలో.. అంత డ్యూరేషన్ ఉండబోతుందా..?

Update: 2021-05-05 08:34 GMT
కన్నడ చిత్రపరిశ్రమలో రూపొందిన సాలిడ్ యాక్షన్ మూవీ కేజీఎఫ్ ఏమంటా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిందో గాని దేశవ్యాప్తంగా ఆడియన్స్ దృష్టిని తనవైపు తిప్పేసుకుంది. ఏకంగా ఆ మధ్యలో కేజీఎఫ్ - 2 రిలీజ్ రోజున నేషనల్ హాలిడే కావాలనే రేంజిలో జనాలకు ఎక్కేసింది. 2018లో విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీ పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదలై ఎలాంటి సంచలన విజయం అందుకుందో అందరికి తెలిసిందే. ఒక్కసారిగా ఒకే మూవీతో పాన్ ఇండియా స్టార్డం అందుకున్నారు హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా.. యాక్టర్స్ - డైరెక్టర్ ఎవరో తెలియకుండా విడుదలైన కేజీఎఫ్ మూవీ సాలిడ్ హిట్ కొట్టి ఊహించని రేంజిలో కలెక్షన్స్ కూడా రాబట్టింది.

ప్రస్తుతం కేజీఎఫ్ సెకండ్ పార్ట్ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇదివరకే గ్లింప్స్ తో పాటుగా కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. అప్పటినుండి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులలో అంచనాలు రెట్టింపు అయిపోయాయి. అయితే ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాకముందే సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా సగానికి పైగా ఫినిష్ చేశారట. అందుకే గతేడాది షూటింగ్ కంప్లీట్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా డ్యూరేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. అసలే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కలిగిన ఈ సినిమాలో మరో క్రేజీ మసాలా సాంగ్ కూడా ఉండబోతుందట.

మరి ఈ లెక్కన సినిమా అంచనాలకు తగ్గట్టుగా నిడివి కూడా పెద్దగానే ఉంటే బాగుటుందని సినీవర్గాలలో టాక్. అయితే తాజా సమాచారం ప్రకారం.. కేజీఎఫ్ సీక్వెల్ మూవీ డ్యూరేషన్ 2గంటల 52నిముషాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఓవైపు సలార్ షూటింగ్ తో పాటు కేజీఎఫ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నాడు దర్శకుడు. అయితే కేజీఎఫ్ ఫైనల్ కట్ నిడివి ఎక్కువగానే ఉందట. నిజానికి షూటింగ్ కంప్లీట్ అయిపోయాక ఎడిటింగ్ చేసేసరికి సినిమా 3గంటకు నిడివి వచ్చిందని.. అయినా అన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఉండటంతో ఎలాంటి కటింగ్స్ చేయలేదని కథనాలు వినిపిస్తున్నాయి. మరి లెన్త్ ఎక్కువే అయినప్పటికీ ప్రేక్షకులను కూర్చోబెట్టే సీన్స్ చాలా ఉన్నాయని అందుకే ఈ విధంగా విడుదల చేయాలనీ మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు టాక్. చూడాలి మరి ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో..!
Tags:    

Similar News