ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ గా మారితే సమీకరణాలన్నీ మారిపోతుంటాయి. అప్పటి వరకు వున్న లెక్కలు కూడా పెద్ద ఎత్తున మార్పులకు గురవుతాయి. ఇప్పడు 'పుష్ప' విషయంలోనూ ఇదే జరుగతోందా? అంటూ టాలీవుడ్ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప ది రైజ్' గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ లోనూ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద స్వైర విహారం చేసింది. ఊహించని విధంగా వసూళ్లని రాబట్టి బాలీవుడ్ వర్గాలకు కాళరాత్రుల్ని మిగిల్చింది.
దీంతో 'పుష్ప పార్ట్ 2'.. పుష్ప ది రూల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పార్ట్ 1 కి మించి పార్ట్ 2 ని మరిన్ని ప్రత్యేకతలతో తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇందు కోసం గత కొన్ని రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇటీవల విడుదలైన 'కేజీఎఫ్ 2' దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో 'పుష్ప 2'లో భారీ మార్పులకు దర్శకుడు సుకుమార్ శ్రీకారం చుట్టారట. పార్ట్ 1 కి మించి పార్ట్ 2 ని మరింత కొత్తగా, మరింత ఎఫెక్టీవ్ గా తెరపైకి తీసుకురావాలని, ఫస్ట్ పార్ట్ విషయంలో జరిగిన కొన్ని కొన్ని లోపాలని పార్ట్ 2 విషయంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పార్ట్ 2 కథని సిద్ధం చేస్తున్నారట.
ఇందు కోసం ఇటీవల అమెరికా వెళ్లిన సుకుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ కు తుదిమెరుగులు దిద్దే ప్రయత్నాల్లో వున్నారట. జూలైలో 'పుష్ప 2'ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సీక్వెల్స్ అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలుస్తున్న నేపథ్యంలో 'పుష్ప 2' ని కూడా ఏ విషయంలోనూ రాజీపడకుండా తెరకెక్కించాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ పార్ట్ సక్సెస్ తో పాటు ఇటీవల విడుదలైన 'కేజీఎఫ్ 2'ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ లో భారీ మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది.
బన్నీ, సుకుమార్ పార్ట్ 2 కు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ని డిమాండ్ చేశారట. ఇందుకు మేకర్స్ కూడా అంగీకరించినట్టుగా ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బడ్జెట్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం తాజాగా బయటికి వచ్చింది. 'పుష్ప 2' కోసం మొత్తం 400 కోట్లు ఖర్చు చేయబోతున్నారని టాక్. కానీ అసలు విషయం ఏంటంటే ఈ మూవీ బడ్జెట్ రెమ్యునరేషన్ లతో కలుపుకుని 375 కోట్లని తెలిసింది.
ఇందులో 175 కోట్లు రెమ్యునరేషన్ లకు పోగా సినిమా బడ్జెట్ 200 కోట్లంట. మొత్తం కలిపి 375 కోట్లని తెలుస్తోంది. అయితే బయట ప్రచారం మాత్రం 400 కోట్లు అని చేస్తున్నారు. ఇక ఇందులో అల్లు అర్జున్ కు 100 కోట్లని, డైరెక్టర్ కు 65 కోట్లని, టెక్నీషయిర్స్ కి 35 కోట్లని, మేకింగ్ కి అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కి కలిపి 200 కోట్లు అని చెబుతున్నారు. అసలు ఎంటైర్ బడ్జెట్ మాత్రం 375 కోట్లన్నది అఫీషియల్ లెక్క. ఇందులోనే హీరో, డైరెక్టర్, హీరోయిన్ అండ్ టెక్నీషియన్ ల రెమ్యునరేషన్ లు వున్నట్టుగా తెలుస్తోంది.
ఫస్ట్ పార్ట్ సంచలన విజయం సాధించడంతో 'పుష్ప 2' కు భారీ గానే బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇటీవల కేజీఎఫ్ 2 రికార్డు స్థాయిలో వసూళ్లని రాబడుతున్న నేపథ్యంలో 'పుష్ప 2' కూడా ఇదే స్థాయిలో రికార్డుల మోత మోగించడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా భారీ ఆఫర్లు వస్తున్నాయట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో వున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలైలో ప్రారంభం కాబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.