ఖైదీ టార్గెట్ 92.5 కోట్లా? వామ్మో!

Update: 2017-01-03 07:31 GMT
మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150కి.. ఆల్ టైం హై లెవెల్ లో బిజినెస్ చేశారనే విషయం ముందు నుంచి తెలిసిందే. కానీ టోటల్ గా ఖైదీ ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందనే విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే. ఖైదీ నంబర్ 150 హిట్ అనిపించుకోవాలంటే.. ఏకంగా 92.5 కోట్ల రూపాయలను థియేట్రికల్ షేర్ రూపంలో రాబట్టాల్సి ఉంటుంది. కంటెంట్ బాగుంటే డిమానిటైజేషన్ ను అధిగమించచ్చని ఇప్పటికే ప్రూవ్ కావడంతో.. మెగాస్టార్ ఏఏ ఏరియాల్లో ఎంతెంత రాబట్టాలో తెలుసుకుందాం.

మెగాస్టార్ కి నైజాం ఏరియా కీలకం అనే సంగతి తెలిసిందే. ఇక్కడ థియేట్రికల్ రైట్స్ ను 23 కోట్లకు విక్రయించారు. సీడెడ్ లో 11.7 కోట్ల బిజినెస్ చేయగా.. ఉత్తరాంధ్రలో 7.8 కోట్లు.. గుంటూరు 6.4 కోట్లు.. కృష్ణా 4.6 కోట్లు.. ఈస్ట్ 5.4 కోట్లు.. వెస్ట్ 4.6 కోట్లు.. నెల్లూరు ఏరియాకు 3 కోట్లు థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చాయి. అంటే.. టోటల్ తెలుగు రాష్ట్రాల్లోనే 66.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఖైదీ.

కర్నాటకలో 8.5 కోట్లు.. తమిళనాడు కోటి.. రెస్టాఫ్ ఇండియా కోటి రూపాయల బిజినెస్ చేయగా.. ఓవర్సీస్ లో 12 కోట్లకు రైట్స్ ను విక్రయించారు. మొత్తం 89 కోట్లు థియేట్రికల్ రైట్స్ రూపంలో రాగా.. ఈ మొత్తాన్ని ప్రింట్స్.. పబ్లిసిటీ ఖర్చులతో కలుపుకుంటే 92.5 కోట్లను రాబడితే మాత్రమే ఖైదీ నంబర్ 150ని హిట్ కేటగిరీలో చేర్చాల్సి ఉంటుంది. టాలీవుడ్ టాప్ 3లో చోటు సంపాదించుకుంటే మాత్రమే ఇది సాధ్యం అనే విషయం మర్చిపోకూడదు.

ఇక శాటిలైట్ రూపంలో 13 కోట్లు దక్కగా.. ఆడియో-వీడియో-డిజిటల్ రైట్స్ రూపంలో 1.5 కోట్లు వచ్చాయి. మొత్తంగా విడుదలకు ముందే 103.5 కోట్ల వ్యాపారం చేసి కం బ్యాక్ లోనే ఖైదీ నంబర్ 150తో సెన్సేషన్ క్రియేట్ చేశారు మెగాస్టార్. కానీ ఈ రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలంటే మాత్రం.. ఈ మొత్తాన్ని తిరిగి రాబట్టాల్సిందే. మెగాస్టార్ ఈ టార్గెట్ ను ఏ మేరకు అందుకుంటారనే అంశపై.. టాలీవుడ్ ట్రేడ్ జనాలు తెగ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News