చిరు సినిమాకు అక్కడ పెద్ద పంచే పడింది

Update: 2017-01-28 08:21 GMT
మెగాస్టార్ చిరంజీవి నైజాం ఏరియాలో కింగ్. ఈ ఏరియాలో ఆయన తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్నారు. ఒకప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ రికార్డులన్నీ ఆయన పేరిటే ఉండేవి. ఐతే ‘ఖైదీ నెంబర్ 150’ విషయంలో మాత్రం ఆయనకు ఈ ఏరియాలో పెద్ద పంచే పడింది. మిగతా ఏరియాలన్నింట్లో లాభాలు తెచ్చిపెట్టిన ‘ఖైదీ నెంబర్ 150’ మాత్రం అంచనాలకు తగ్గట్లుగా పెర్ఫామ్ చేయలేకపోయింది. ఈ ఏరియా హక్కుల కోసం రూ.21 కోట్ల ఆఫర్ వచ్చినా.. వద్దనుకుని అల్లు అరవింద్.. మరో పంపిణీదారుడితో కలిసి సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పుడు చూస్తే ఈ సినిమా షేర్ రూ.18 కోట్లను దాటిందంతే. మూడో వీకెండ్ కూడా అయిపోవడంతో ఇక ‘ఖైదీ..’ కలెక్షన్ల కథ ముగిసినట్లే.

రూ.21 కోట్ల ఆఫర్ కాదనుకున్నారంటే ఇంకో రెండు మూడు కోట్లు అదనంగానే ఆశించారేమో. కానీ ఆ ఆఫర్ ను వదులుకోవడం వల్ల రూ.2 కోట్ల దాకా ఆదాయంలో కోత పడింది. నైజాం ఏరియాలో హైదరాబాద్ కలెక్షన్లు కీలకం. హైదరాబాద్ కలెక్షన్లలో మల్టీప్లెక్సుల పాత్ర కీలకం. ఐతే సంక్రాంతి సినిమాల్లో ‘ఖైదీ నెంబర్ 150’ కంటే కూడా గౌతమీపుత్ర శాతకర్ణి.. శతమానం భవతి మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను బాగా ఆకర్షించాయి. ఫస్ట్ వీకెండ్ తర్వాత వీటికే ప్రయారిటీ ఇచ్చారు మల్టీప్లెక్స్ ఆడియన్స్. దీంతో కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. ఒకరకంగా చెప్పాలంటే నైజాం ఏరియాలో ‘ఖైదీ నెంబర్ 150’ లాస్ వెంచర్. మరోవైపు ఓవర్సీస్ లోనూ ‘ఖైదీ నెంబర్ 150’కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రిమియర్లలో చూపించిన జోరు తర్వాత కనిపించలేదు. అక్కడ బ్రేక్ ఈవెన్‌ కు దగ్గర్లో నిలిచిపోయేలా ఉందీ సినిమా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News