ఉత్తరాది ప్రేక్షకులు అమితంగా ఆధరించే ఖత్రోన్ కె ఖిలాడీ షో లో బుల్లి తెర నటి కనిక మన్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇటీవల ఈ షో స్టంట్స్ లో భాగంగా కనిక మన్ కు గాయాలు అయ్యాయి. గాయం కారణంగా కనిక షో నుండి ఎగ్జిట్ అవుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆమె షో లో కంటిన్యూ అవుతున్నట్లుగా క్లారిటీ ఇచ్చింది.
గాయంతోనే ఖత్రోన్ కె ఖిలాడీ షో లో పాల్గొంటున్న కనిక మన్ పై ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతటి సాహసం ఎవరు చేయలేరు.. ఇది కేవలం కనిక కు మాత్రమే సాధ్యం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కనిక ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియా మరియు వెబ్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. రుహానియత్ షూటింగ్ లో ఉన్న సమయంలో ఖత్రోన్ కె ఖిలాడీ నుండి ఆఫర్ వచ్చింది. నేను షో చేయగలనా అని మొదట అనుకున్నాను. చివరి నిమిషంలో షో కు సైన్ చేశాను. షూటింగ్ లో జాయిన్ అయిన సమయంలో చాలా హ్యాపీగా అనిపించింది. కాని స్టంట్స్ చేస్తూ గాయపడ్డాను. షూటింగ్ లో ఉన్న సమయంలో నొప్పి తెలియలేదు. కాని ఆ తర్వాత కనీసం కదలలేక పోయాను.
షూటింగ్ లో గాయపడ్డ సమయంలో నాన్న నన్ను బయటకు వచ్చేయమన్నాడు. కాని నేను అలాగే కంటిన్యూ అయ్యాను. షో ను ఇంట్రెస్ట్ గా మార్చడం కోసం నిర్వాహకులు కొన్ని సార్లు బికినీ వేసుకోవాలని కూడా సూచించారు. అందరితో పాటు నేను కూడా బికినీ వేసుకున్నాను. ఆ ఫోటోలను నేను ఇన్ స్టా లో షేర్ చేసిన సమయంలో నాన్నను ఇన్ స్టా లో బ్లాక్ చేసేదాన్ని.
నా బికినీ ఫోటోలు షేర్ చేసిన సమయంలో నాన్నను బ్లాక్ చేస్తే ఆయనకు అర్థం అయ్యేది కాదు. చెల్లి వద్దకు వెళ్లి నాన్న నా ఫోటోలు కనిపించడం లేదని అమాయకంగా అడిగేవాడట. కొన్ని సందర్బాల్లో నాన్న షో నుండి వచ్చేమని అన్నా కూడా ఆయన మద్దతు పూర్తిగా నాకు ఉన్నందుకు సంతోషంగా ఉందని కనిక చెప్పుకొచ్చింది.