డింపుల్ హయాతి.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2017లో విడుదలైన 'గల్ఫ్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత యురేక, దేవి 2, అభినేత్రి 2 సహా తదితరల చిత్రాల్లో నటించింది. కానీ, ఇవేమి ఆమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అలాంటి తరుణంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన 'గద్దలకొండ గణేష్'లో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చింది.
ఈ అవకాశామే ఆమె కెరీర్ టర్న్ అయ్యేలా చేసింది. వరుణ్ తేజ్ తో కలిసి 'జర్ర జర్ర' అంటూ ఐటెం సాంగ్ తో యూట్యూబ్ ను ఓ ఊపు ఊపేసి కావాల్సినంత క్రేజ్ సొంతం చేసుకుంది. ఆపై బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో ఒకేసారి మూడు సినిమాలను పట్టేసింది.
అందులో ఒకటి 'అత్రంగి రే'.అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గత ఏడాది ఓటీటీలో విడుదలైంది. ఇందులో అక్షయ్ సోదరిగా, ధనుష్‌ను ప్రేమించే యువతిగా డింపుల్ బాగానే అలరించింది.
ఆ వెంటనే విశాల్ సరసన ఈమె చేసిన 'సామాన్యుడు', మాస్ మహారాజ్ రవితేజకు జోడీగా నటించిన 'ఖిలాడి' చిత్రాలు ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ముఖ్యంగా వీటిలో ఖిలాడిపై డింపుల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇందులో హద్దులు మీరి అందాలు కూడా ఆరబోసింది. కానీ, ఏం లాభం.. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయింది.
వరసగా రెండు ఫ్లాపులు పడటంతో.. ఇప్పుడు డింపుల్ కు అవకాశాలే కరువయ్యాయి. దీంతో ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతకు తెర లేపింది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో కుర్రాళ్ళకు నిద్ర పట్టకుండా చేస్తుంది. అయినప్పటికీ.. ఆఫర్లు మాత్రం రావడం లేదట.
ఖిలాడి విడుదలై రెండు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు డింపుల్ నుంచి ఒక్క కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. దీంతో ఈ భామను పట్టించుకునే నాధుడే లేడంటూ ప్రచారం మొదలైంది. మరి డింపుల్ కు నిజంగానే అవకాశాలు రావడం లేదా..? లేక మంచి కథల కోసం వెయిట్ చేస్తుందా..? అన్నది తెలియాల్సి ఉంది.