ప్రచారం కోసం చెప్పారో.. నిజంగానే అంత ఖర్చు చేశారో తెలీదు కానీ.. మాస్ మహరాజ్ గా పేరున్న రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. డింపుల్ హయాతి.. మీనాక్షి చౌదరీ నటిస్తున్న ఈ మూవీలో రవితేజ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రానికి రాక్షసుడు దర్శకుడు రమేశ్ వర్మదర్శకత్వం వహించారు. రాక్షసుడు తర్వాత ఆయన నుంచి వస్తున్న మూవీ కావటంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ కు ముందే సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్కు వేగంగా సాగుతోంది.
యాక్షన్ థ్రిల్లర్ మూవీగా చెబుతున్న ఈ చిత్రం ట్యాగ్ లైన్ ‘ప్లే స్మార్ట్’. జీవితంలో డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వాలా? భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వాలా? లేక రెండూ ముఖ్యమా? అని ఆలోచించేలా ఈ మూవీ ఉంటుందని చెబుతున్నారు. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు దర్శకుడు.
ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేశామని చెప్పిన రమేశ్ వర్మ అక్కడితో ఆగకకుండా.. ఖర్చు లెక్క చెప్పి బిత్తరపోయేలా చేశారు. ఈ సినిమా కోసం రూ.65కోట్లు ఖర్చు పెట్టినట్లుగా వెల్లడించారు. ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే.. గడిచిన కొంతకాలంగా రవితేజ మూవీకి పెట్టాల్సిన దాని కంటే భారీగా ఖర్చు చేశారంటున్నారు. ఇంత భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందన్నది ఈ సినిమా చూస్తే కానీ తెలీదేమో?
నిర్మాత తనపై నమ్మకంతో ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేసినట్లు చెబుతున్నారు దర్శకుడు. ఖర్చు చేసే ప్రతిసారీ నమ్మకంతోనే చేస్తారు కదా? కానీ.. లెక్క తేడా వచ్చినప్పుడే.. అసలు విషయాలు బయటకువస్తాయంటున్నారు. ఏమైనా.. ఇంత భారీ ఖర్చు చేసిన ఖిలాడి ఎలా ఉంటుందన్న టాక్ ఇప్పుడు మొదలైంది. లేనిపోయింది.. ఇలాంటి చర్చ కోసమే.. రమేశ్ వర్మ ఖర్చు లెక్క చెప్పారా ఏంటి?