కియరా అద్వాణీ .. ప్రస్తుతం ఉత్తరాది- దక్షిణాది అనే తేడా లేకుండా మార్మోగుతున్న పేరు ఇది. ఓవైపు బాలీవుడ్ లో నటిస్తూనే మరోవైపు టాలీవుడ్ లోనూ క్రేజీ స్టార్ల సరసన అవకాశాలు అందుకుంటోంది అమ్మడు. మహేష్ భరత్ అనే నేను.. రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రాల్లో నటించిన కియరాకు ఇక్కడ వీరాభిమానులేర్పడ్డారు. ఒకటి బ్లాక్ బస్టర్.. ఇంకొకటి డిజాస్టర్ అయినా .. ఈ రిజల్ట్ తో సంబంధం లేకుండా ఇక్కడ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అందుకే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా మరో ఇద్దరు స్టార్ హీరోల తో అవకాశాలున్నాయని ఇటీవల ప్రచారమైంది.
అయితే తెలుగు సినిమాల్లో అవకాశాల మాటేమో కానీ.. అటు బాలీవుడ్ లో ఈ అమ్మడి కెరీర్ ఓ రేంజులో వెలిగిపోతోంది. అక్కడ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన కాంచన రీమేక్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. లారెన్స్ దర్శకత్వ ంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లక్ష్మి బాంబ్ అనే టైటిల్ ని నిర్ణయించారు. ఈ సినిమాతో పాటు మరో జాక్ పాట్ ఈ అమ్మడిని వరించింది. సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా తెరకెక్కనున్న షేర్ షా అనే భారీ చిత్రంలో ఈ బ్యూటీ నాయికగా ఎంపికైంది. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ దర్శకత్వ ం వహించనున్నారు. ప్రఖ్యాత దర్శకనిర్మాత కరణ్ జోహార్ పలువురు భాగస్వాములతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథాంశం అంతే ఇంట్రెస్టింగ్.
కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైన్య ంతో విరోచితంగా పోరాడి అమరుడైన విక్రమ్ బాత్రా జీవితకథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 7 జూలై 1999లో యుద్ధంలో విక్రమ్ మరణించారు 24 వయసుకే మరణించిన ఈ వీరుడికి పరమ వీర చక్ర బిరుదును ఇచ్చింది ప్రభుత్వ ం. వార్ నేపథ్య ంలోని ఈ చిత్రంలో కియరా ఎలాంటి పాత్రలో నటించనుంది అన్నది తెలియల్సి ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటించారు. విక్రమ్ బాత్రా నిక్ నేమ్ `షేర్ షా` ని టైటిల్ గా ఎంపిక చేసుకోవడం ఆసక్తికరం.