అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ హిందీ చిత్ర సీమ లో 2019 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. షాహిద్ కెరీర్ లోనే ఓ సరికొత్త చరిత్ర సృష్టించిన చిత్రమిది. దాదాపు 300కోట్ల వసూళ్లు సాధించింది ఈ చిత్రం. ఇందు లో కియరా అద్వాణీ కథా నాయిక గా నటించింది. ఇంటెన్స్ పాత్రలో నటించిన కియరా పై క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. అయితే నిజ జీవితం లో కియరా అలా ఉంటుందా? అని ప్రశ్నిస్తే .. అస్సలు ఛాన్సే లేదని అంగీకరించింది. నిజజీవితంలో తాను వేరు. ప్రీతిలా కొన్ని చేయగలను. అన్నిట్లో అలా ఉండలేనేమో! అని అంది.
2019 కియారా అద్వానీ కెరీర్ కి బాగా కలిసొచ్చిన ఏడాదిగా నిలిచింది. ప్రీతిగా కియారా నటనకు గుర్తింపు వచ్చింది. అయితే ..అణచి వేతకు గురైన ప్రేమికురాలి పాత్ర అది అంటూ.. హాని కలిగించే ప్రియుడు కబీర్ సింగ్ అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. కబీర్ లాంటి పాత్రను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్థించడం సరైనదేనా? అంటూ చర్చ సాగింది. అలాంటి పాత్రను అంగీకరించడమెలా? ప్రీతిగా కియరా ప్రవర్తించిన తీరు సరైనదేనా? అని ప్రశ్నిస్తే...
ప్రతి ఒక్కరూ అభిప్రాయాలు చెప్పొచ్చు. వ్యక్తిగతంగా నాకు ప్రత్యేకమైన చిత్రమిది. ఈ పాత్ర నా స్వభావానికి భిన్నమైనది. సరైనదా కాదా అనే చర్చలో పాల్గొనలేను. అది తప్పు ఒప్పు అనేది నాకు కూడా తెలియదు. నేను ఏం చేసినా చేసే పనిలో జీవించేందుకే ఇష్టపడతాను. ప్రతి ఒక్కరూ వారేం అనుకుంటే అదే చెప్పారు. ఈ చిత్రానికి మంచి ఫీడ్ బ్యాక్ దక్కింది అని తెలిపారు.
ప్రీతి ప్రేమ లో చేసిన అదే పనిని కియరా చేస్తుందా అని ప్రశ్నిస్తే.. ``వ్యక్తి గతంగా.. నేను చాలా భిన్నమైన వ్యక్తిని. నేను అలాంటి పరిసరాల్లో ఎదగని కారణం గా నేను తనలాగే స్పందించకపోవచ్చు. నా మనస్తత్వం వేరు.. నేను పెరిగిన పరిసరాలు వేరు. కియారా పూర్తిగా వేరు. ప్రీతితో పోలిక అన్నదే ఉండదు. ప్రీతి చేసిన చాలా పనులు నేను చేయలేను`` అని కియరా తెలిపింది. ఈ సినిమాలో ప్రతిదీ కల్పితమైనవి. ప్రీతి లేదా కబీర్ లాగా ఉండమని ఎవరూ మిమ్మల్ని అడగడం లేదు. అవి రెండూ చాలా లోపం ఉన్న క్యారెక్టర్లు అని కియరా అభిప్రాయం వ్యక్తం చేసింది.