కియారా క‌న్ను గీటుడుకి వెర్రెత్తిపోవ‌డం ఖాయం!

Update: 2022-05-02 06:30 GMT
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాణీ 'బూల్ బూలైయా-2' సినిమా ప్ర‌మోష‌న్లో బిజీగా ఉంది. యంగ్ హీరో కార్తిక్ ఆర్య‌న్ తో క‌లిసి జంట‌గా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు హాజ‌ర‌వుతుంది. ఈనెల 20న సినిమా రిలీజ్ అవుతుండ‌టంతో  ఉత్త‌రాది సిటీలు మొత్తం చుట్టేస్తోంది. ఇక ప్ర‌చారంలో పాల్గొంటోన్న అమ్మ‌డు హ‌డావుడి చేయ‌క‌పోతే ఎలా?  అందుకే ఇన్ స్టా వేదిక‌గా రీల్స్  చేస్తూ యువ‌త‌ని ఆక‌ట్టుకుంటుంది.

ప్ర‌చారంలో భాగంగా  ఎక్కిన ప్లైట్ దగ్గ‌ర నుంచి ల్యాండ్ అయిన హోటల్ వ‌ర‌కూ ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఎలా ప‌డితే అలా  కెమెరాకి ఫోజులిస్తుంది. మంచి  డిజైన‌ర్ దుస్తుల్లో...  మేక‌ప్ వేసుకుంటోన్న స‌మ‌యంలో..చివ‌రికి తింటోన్న మ‌యంలో సైతం కెమెరాని విడిచిపెట్ట‌లేదు.

ఏదో ర‌కంగా ఇన్ స్టాన్ల ని  షేక్ చేసే కాన్సెప్ట్ లోనే ఉంద‌నిపిస్తుంది. వీడియో ఆరంభంలోనే  స్టైల్ గా  వాక్ చేసుకుంటు వ‌స్తూ..న‌డ్డి అటు ఇటు ఊపుతో ఓ సారి అలా కుడి క‌న్ను గీటింది.

అంతే ఆ గీటుడు చూస్తే ఎవ‌రైనా ప్లాట్ అయిపోవాల్సిందే.  ఆ రేంజ్ లో కియారా యువ‌త‌ని ఆక‌ట్టుకునేలా హైలైట్ అవుతుంది. త‌న‌దైన శైలిలో వెస్ర్ట‌న్ స్టెప్పులు సైతం వేసింది. ప్ర‌స్తుతం ఆ వీడియో  ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. కియారా అభిమానులు చూసి త‌రిస్తున్నారు. మ‌రో వీడియో లో కార్తీక్ ఆర్య‌న్-కియారా కుర్చుని ఉండ‌గా... ఆ ఫోజులో కియారా క్లీవేజ్ అందాల‌పై కెమెరా క‌న్ను ప‌డింది.

కెమెరా అలా జూమ్ అవుతోన్న స‌మ‌యంలో కార్తిక్ ఒక్క‌సారిగా పైకి లేచి కెమెరాకి అడ్డుగా నుంచున్నాడు.  ఆ తర్వాత మ‌ళ్లీ య‌ధాస్థానంలో కుర్చున్నాడు. అయితే కార్తీక్ తో పాటు...కియారా కూడా ఆ స‌మ‌యంలో పైకి లేచింది. మ‌రి ఇద్ద‌రు ఫోటో సెష‌న్ కోసం అలా పైకి లేచారా?  ఇంకేదైనా కార‌ణం ఉందా? అన్న‌ది తెలియాలి.

కియారా అద్వాణీ తెలుగులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇది చ‌ర‌ణ్ కి 15వ చిత్రం. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. పాన్ ఇండియా కేట‌గిరిలో సినిమా రిలీజ్ కానుంది. అలాగే గ‌తంలో చ‌ర‌ణ్ న‌టించిన 'విన‌య విధేయ రామ‌'లో న‌టించిన విష‌యం తెలిసిందే.

Full View

Tags:    

Similar News