ఫోటో స్టొరీ: బటన్లు తీసి మరీ హాటు తీన్ మార్..!

Update: 2019-07-29 07:18 GMT
కృతి కర్బందా మొదటి సినిమా సుమంత్ హీరోగా నటించిన 'బోణి'.  ఆ తర్వాత  'తీన్ మార్'.. 'Mr. నూకయ్య'.. 'ఒంగోలు గిత్త'.. 'ఓం 3D'.. 'బ్రూస్ లీ' లాంటి సినిమాల్లో నటించింది కానీ ఆ సినిమాలు విజయాలు సాధించకపోవడంతో కృతికి బ్రేక్ రాలేదు. తర్వాత కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయింది.  ఈమధ్య మాత్రం హిందీపై పై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. అంతటితో ఆగితే మనం ఎందుకు ఈ భామ గురించి మాట్లాడుకుంటాం? ఈ భామ సోషల్ మీడియాపై కూడా గట్టిగా ఫోకస్ చేస్తోంది.

కృతికి ఇన్స్టాలో 3.9 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. వారికోసం తరచుగా ఏదో ఒక హాట్ ఫోటో పోస్ట్ చేస్తూ.. ఆ ఫోటోతో పాటుగా ఏదో ఒక ఫిలాసఫీ కూడా చెప్తుంది.  అయితే తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఏ ఫిలాసఫీ లేకుండా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "మండే బ్లూస్.. స్మైల్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ ఫోటోలో కృతి ఒక ఐస్ బ్లూ షర్టు.. అదే రంగులో ఉండే చిరుగుల జీన్సు ధరించి ఒక సోఫా పై కూర్చుంది.  షర్టు కు బటన్స్ పెట్టుకోకపోవవడంతో నెటిజన్లకు ఆటోమేటిక్ గా అందాల వ్యూ వచ్చేసింది.  ఇక కృతి నవ్వు మామూలుగా లేదు..  ట్రంపు సారు లాగా "బంగ్లాదేశా.. అలాంటి దేశం కూడా ఒకటి ఉందా?" అంటూ ఓ కామెంట్ చేస్తేనే తప్ప ఎవరూ అలా నవ్వలేరు.  

ఈ ఫోటోకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.  కొందరేమో "బ్రాడ్ స్మైల్ స్వీట్ హార్ట్".. "బ్యూటిఫుల్ స్మైల్.. హాట్ పోజు" అంటూ మెచ్చుకున్నారు.  అయితే కొందరేమో "దీనికంటే అసలు ఆ ప్యాంట్ వేసుకోకపోతే మేలు".. "అక్కా టైలర్ ఫోన్ నంబర్ ఇవ్వాలా?" అంటూ సెటైర్లు సంధించారు.   ఇక సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో 'హౌస్ ఫుల్ 4'.. 'పాగల్ పంటి'.. 'చెహ్రే' సినిమాల్లో నటిస్తోంది.  తమిళంలో 'వాన్' అనే సినిమాలో నటిస్తోంది.


Tags:    

Similar News