‘కిల్లింగ్ వీరప్పన్’ రివ్యూ
నటీనటులు- శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, పారుల్ యాదవ్, యాజ్న శెట్టి, సంచారి విజయ్, రాక్ లైన్ వెంకటేష్ తదితరులు
ఛాయాగ్రహణం: రామీ
నేపథ్య సంగీతం: శాండీ
సంగీతం: రవిశంకర్
మాటలు- శశాంక్ వెన్నెలకంటి
నిర్మాతలు: శివప్రకాష్, మంజునాథ్, సుధీంద్ర
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ నుంచి స్థాయికి తగ్గ సినిమా వచ్చి చాలా కాలమైంది. ‘రక్తచరిత్ర’ తర్వాత ఆయన సినిమాల స్థాయి పడిపోతూ వస్తోంది. ఆర్జీవీ డైహార్డ్ ఫ్యాన్స్ సైతం ఆయన సినిమాలంటే భయపడే పరిస్థితి వచ్చేసింది గత కొన్నేళ్లలో. ఇలాంటి సమయంలో ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో మళ్లీ వర్మ ముద్ర కనిపిస్తుందేమో అన్న ఆశ రేపింది దాని ట్రైలర్. మరి నిజ జీవిత కథలతో తీసే సినిమాల్లో తన ప్రత్యేకత చాటుకునే వర్మ.. వీరప్పన్ ను మట్టుబెట్టిన ఆపరేషన్ నేపథ్యంలో తెరకెక్కించిన ‘కిల్లింగ్ వీరప్పన్’లోనూ ఆ స్పెషాలిటీ చూపించాడా? అభిమానులు తనపై పెట్టుకున్న ఆశల్ని నెరవేర్చాడా? చూద్దాం పదండి.
కథ:
ఆసియాలో అతి పెద్ద క్రిమినల్ వీరప్పన్ ను చంపే ఆపరేషన్ నేపథ్యంలో సాగే కథ ఇది. వీరప్పన్ ను చంపేందుకు చేపట్టిన ఆపరేషన్లీ విఫలమైన సమయంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం తరఫున ప్రత్యేకమైన ప్రణాళికతో రంగంలోకి దిగుతాడు కన్నన్. వీరప్పన్ ను అడవి నుంచి బయటికి రప్పిస్తేనే అతణ్ని చంపగలమని భావించి.. కోవర్ట్ ఆపరేషన్ ద్వారా అతణ్ని బుట్టలో వేయడానికి ప్రయత్నిస్తాడు. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి ద్వారా అతణ్ని బయటికి రప్పించే ప్రయత్నం చేస్తాడు. కానీ వీరప్పన్ అతడి ప్రణాళికను పసిగట్టి భగ్నం చేస్తాడు. వీరప్పన్ కోసం రకరకాల మార్గాల్లో మళ్లీ మళ్లీ ప్రయత్నించి చివరికి కన్నన్ అతణ్ని ఎలా తుద ముట్టించాడు అన్నది మిగతా కథ.
కథనం, విశ్లేషణ:
నిజ జీవిత కథలతో సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మది ప్రత్యేకమైన శైలి. మనకందరికీ తెలిసిన కథల్ని తన కోణంలో ఆసక్తికరంగా చెప్పగల నైపుణ్యం ఆయన సొంతం. అందుకు ‘రక్తచరిత్ర’ సరైన ఉదాహరణ. ‘ముంబయి 26/11’ కూడా బాగానే తెరకెక్కించారు. ఆ నిజ జీవిత గాథల్లోని ఇంటెన్సిటీని ఏమాత్రం తగ్గకుండా తెరమీదికి తీసుకురావడంలో విజయవంతమయ్యాడు వర్మ. ఆర్జీవీ ఎలాంటి సినిమాలు తీసినప్పటికీ.. అన్నింట్లోనూ కనిపించే ప్రత్యేకత.. ఈ ఇంటెన్సిటీనే. ఇంకా టేకింగ్ లోనూ తన ముద్ర చూపిస్తారు. ‘కిల్లింగ్ వీరప్పన్’లో ప్రత్యేకతంగా నిలిచిన అంశాలు.. ఈ ఇంటెన్సిటీ, టేకింగే.
వీరప్పన్ ను చంపే ఆపరేషన్ కు సంబంధించి పుస్తకాలు, పత్రికలు చదివో.. పోలీసులతో మాట్లాడో... వర్మ ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకుని ఉండొచ్చు. ఎంతో ఎగ్జైట్ అయి ఉండొచ్చు. ఐతే తాను తెలుసుకున్న సంఘటనల్ని విజువలైజ్ చేసుకుని.. దాన్ని దృశ్యరూపంలోకి మార్చి... తనకెంత ఎగ్జైట్మెంట్ కలిగిందో మనకూ అంతే ఎగ్జైట్మెంట్ కలిగించడానికి బాగానే ప్రయత్నించాడు వర్మ. ఇది వాస్తవ గాథ కాబట్టి.. సన్నివేశాలు ఇంకా పకడ్బందీగా ఉండాల్సిందనో.. మరిన్ని మలుపులు ఉండాల్సిందనో.. ఉత్కంఠ తగ్గిందనో.. చర్చించుకోవడానికి లేదు. వాస్తవాల్ని కొంచెం ఎగ్జాజరేట్ చేసి... సాధ్యమైనంత వరకు ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడానికి ప్రయత్నించాడు వర్మ.
సినిమాలో వీరప్పన్ చేతుల్లోనే అతడి సొంత కూతురు చనిపోయే సన్నివేశం ఒకటుంటుంది. పోలీస్ యాంగిల్లో.. వీరప్పనే తాను పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పాపను బండరాయికేసి గుద్ది చంపేసినట్లు చూపిస్తారు. అదే వీరప్పన్ భార్య యాంగిల్లో.. వీరప్పన్ కాలికి రాయి అడ్డం పడ్డపుడు కింద పడటం వల్ల పాప చనిపోయిందని చూపిస్తారు. వీరప్పన్ గాథకు సంబంధించి ఎవరి యాంగిల్ వాళ్లదని, తన యాంగిల్లో తానీ కథను చెబుతున్నానని వర్మ చెప్పకనే చెప్పాడు. ఈ సన్నివేశంలో వాస్తవంగా పాప చనిపోవడానికి కారణమేంటి అన్న వాదన జరిగినపుడు.. ‘‘వీరప్పన్ ఎంచుకున్న జీవితం వల్లే ఆ పాప చనిపోయిందన్నది మాత్రం వాస్తవం’’ అన్న కంక్లూజన్ ఇస్తాడు కథానాయకుడు. క్రిమినల్స్ కు సంబంధించిన కథల్ని వర్మ ఎంత బాగా అవగాహన చేసుకుని.. వాటిని తెరమీదికి తెస్తాడనడానికి ఈ డైలాగే ఉదాహరణ.
సినిమా ప్రధానంగా వీరప్పన్ ను చంపే ఆపరేషన్ మీదే నడిచినప్పటికీ.. మరీ ఒకే యాంగిల్లో సినిమాను నడిపించేయకుండా చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్ ల ద్వారా వీరప్పన్ గతాన్ని కూడా ప్రేక్షకులకు కొంచెం పరిచయం చేసేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు వర్మ. వీరప్పన్ ముత్తులక్ష్మికి తన ప్రేమను చెప్పి పెళ్లి చేసుకునే సీన్ ఆసక్తి రేపుతుంది. ఆ సన్నివేశంలో ‘‘నేను పువ్వును వాసన చూడ్డానికి నలపను’’ అనే డైలాగ్ బాగుంది. వీరప్పన్ లోని మరో యాంగిల్ ఈ డైలాగ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు వర్మ. ఇంటర్వెల్ కు ముందు జరిగే అటాక్ సీన్ సినిమాకు హైలైట్. ఆ సన్నివేశంలో కెమెరా వర్క్, బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వర్మ ముద్ర ప్రధానంగా ఈ సన్నివేశంలో.. తర్వాత క్లైమాక్స్ లో కనిపిస్తుంది. ప్రథమార్ధంలో ఉన్నంత ఆసక్తి.. ద్వితీయార్ధంలో లేనప్పటికీ.. వీరప్పన్ ను అంతమొందించే క్లైమాక్స్ సన్నివేశాన్ని తనదైన శైలిలో అద్భుతంగా తెరకెక్కించాడు వర్మ.
సినిమా కథ ఏంటి.. వర్మ ఏం చూపిస్తాడన్నది ప్రేక్షకులకు ముందే ఓ అవగాహన ఉంటుంది కాబట్టి అంతకుమించి సినిమా నుంచి ఇంకేమీ ఆశించడానికి లేదు. వర్మ ఇంతకుముందు తీసిన రియలిస్టిక్ మూవీస్ నచ్చినవాళ్లకే ఇది కూడా నచ్చుతుంది. ఇది కన్నడ సినిమా కావడం.. రాజ్ కుమార్ ను వీరప్పన్ కిడ్నాప్ చేయడం వారి మనసుల్ని గాయపరిచింది కాబట్టి.. సినిమాలో శివరాజ్ కుమార్ ను ఎక్కువ హైలైట్ చేశాడు వర్మ. కథ అంతా కూడా అతను పోషించిన పోలీస్ ఆఫీసర్ యాంగిల్లోనే సాగుతుంది. దీని వల్ల వీరప్పన్ గురించి కానీ.. అతడి యాక్టివిటీస్ గురించి కానీ సినిమాలో ఎక్కువ చూపించకపోవడం నిరాశ కలిగిస్తుంది. వీరప్పన్ ను చంపే ఆపరేషన్ కు సంబంధించి వాస్తవంగా ఏం జరిగిందన్నది మనకు తెలియదు కానీ.. వర్మ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని తాను తెలుసుకున్న విషయాల్ని కొంచెం ఎగ్జాజరేట్ చేసి చూపించడాని మాత్రం అర్థమవుతంది. ఇది వాస్తవగాథ కాబట్టి దానికి ఉన్న లిమిటేషన్స్ దృష్ట్యా రెగ్యులర్ సినిమాల స్థాయిలో ఎగ్జైట్మెంట్ ఇవ్వకపోవచ్చు, ఎంటర్టైన్ చేయకపోవచ్చు. ఇందులోని మలుపులు సాదాసీదాగా అనిపించవచ్చు. ఐతే వర్మ టేకింగ్ తో కనెక్టయితేనే మాత్రం సినిమా ఆసక్తికరంగా అనిపిస్తుంది.
నటీనటులు:
వీరప్పన్ పాత్రలో జీవించేశాడు సందీప్ భరద్వాజ్. అక్కడ ఉన్నది ఓ నటుడని మరిచిపోతాం. వీరప్పనే కనిపిస్తాడు సినిమా అంతా. బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. ఈ విషయంలో సందీప్ తో పాటు మేకప్ మన్ విక్రమ్ ను, దర్శకుడు వర్మను అభినందించాలి. ఇక వీరప్పన్ ను చంపాలని తపించిపోయే పోలీస్ ఆఫీసర్ పాత్రలో శివరాజ్ కుమార్ కూడా గొప్పగా నటించాడు. వర్మ మార్కు క్లోజప్ షాట్స్ లో శివరాజ్ బాగా చేశాడు. క్లైమాక్స్ లో అతడి నటన బాగా ఆకట్టుకుంటుంది. పారుల్ యాదవ్ కూడా బాగా చేసింది. కానీ ఆమె పాత్రను అవసరానికి మించి వాడుకున్నాడు వర్మ. సినిమా మధ్యలోనే ఆమె పాత్రను ముగించేయాల్సి ఉన్నా.. హీరో పక్కనే ఆమెను పెట్టి.. ప్రతి సన్నివేశంలోనూ ఆమెను క్లోజప్ లో చూపిస్తూ చికాకు పెడతాడు. వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మిగా యాజ్న నటన పర్వాలేదు. మిగతా వాళ్లంతా వర్మ శైలికి తగ్గట్లు నటించారు.
సాంకేతిక వర్గం:
ఈ తరహా సినిమాలకు టెక్నీషియన్స్ నుంచి చాలా సపోర్ట్ తీసుకుంటాడు వర్మ. ‘కిల్లింగ్ వీరప్పన్’ టెక్నీషియన్స్ మూవీ. కెమెరామన్ రామీ, నేపథ్య సంగీతం అందించిన శాండీ అదరగొట్టారు. ఇద్దరూ ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ వర్మ ఆలోచనలకు తగ్గట్లు గొప్ప ఔట్ పుట్ ఇచ్చారు. ఇంటర్వెల్ ముందు సీన్ వాళ్లిద్దరి ప్రతిభకు నిదర్శనం. బ్యాగ్రౌండ్లో ప్లే అయ్యే పాటలు పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడిగా వర్మ చాన్నాళ్ల తర్వాత తన ముద్ర చూపించాడు. మంచి కంటెంట్ ఉంటే దాన్ని బాగా తెరకెక్కించగలనని మరోసారి వర్మ రుజువు చేశాడు. వర్మ దేనికి పడితే దానికి ఎగ్జైట్ అయిపోకుండా ఇలా జనాలకూ ఎగ్జైట్మెంట్ కలిగించే కథాంశాలు ఎంచుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ ‘కిల్లింగ్ వీరప్పన్’ కలిగిస్తుంది.
చివరగా: ఆర్జీవీ.. ‘టేకింగ్’తో చంపేశాడు
రేటింగ్: 3/5