పాపం ఈ మధ్యకాలంలో సెక్సీ స్టార్ కిమ్ కర్దాషియాన్ కు టైం ఏమంత బాగున్నట్లు లేదు. వారంరోజుల వ్యవధిలోనే ఈ సెక్సీ స్టార్ కిమ్ కు మరో షాక్ తగిలింది. నాలుగు రోజుల క్రితం నడిరోడ్డుపై ఈమె వెనుక భాగాన్ని ముద్దాడాలని ప్రయత్నించి ఒక యువకుడు షాకిస్తే... తాజాగా పోలీసులమని చెప్పి ఇద్దరు దుండగులు ఆమెను పూర్తిగా దోచుకున్నారు. దోచుకోవడమంటే... ఆమె వద్ద ఉన్న విలువైన నగలు దోచుకెళ్లారు. అభివృద్ది చెందిన దేశాలని చెప్పుకునే దేశాల్లో గన్ కల్చర్ - క్రైం రేటు బాగా ఎక్కువ ఉంటుంది. దీంతో చాలామంది డబ్బూ నగలతో బయటకు పెద్దగా రారు, అవసరైనప్పుడు కార్డే క్యారీ చేస్తుంటారు. కానీ సెలబ్రెటీలు కు తప్పదుగా!
ఇదే క్రమంలో తాజాగా ప్రముఖ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియాన్ కు చేదు అనుభవం ఎదురైంది. పారిస్ లో బస చేస్తున్న హోటల్ లో ఆమె దోపిడికి గురైంది. తెల్లవారుజామున కిమ్ ఉంటున్న గదిలోకి పోలీసులమంటూ ఇద్దరు దుండగులు చొరపడ్డారు. అప్పటికే ముసుగులు వేసుకున్న ఆ ఇద్దరూ, కిమ్ కు తుపాకీ గురి పెట్టి.. ఆమె వద్దనున్న మిలియన్ డాలర్ల విలువైన నగల్ని దోచుకెళ్లారు. అయితే అదృష్టవశాత్తు ఆమెకు ఏ ప్రమాదం జరగకుండా బయటపడ్డారు. అనంతరం ఆ షాక్ నుంచి తేరుకున్న కిమ్ వెంటనే ఈ విషయం పోలీసులకు తెలియచేసారు. అనంతరం స్పందించిన పోలీసులు ప్రస్తుతం కిమ్ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. హోటల్ గదిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.
కాగా, నాలుగురోజుల క్రితం కిమ్ కర్ధాషియాన్ అభిమాని అయిన విటాలి సెడక్ అనే వ్యక్తి ఆమె పిరుదులపై ముద్దు పెట్టాలని ప్రయత్నించాడు. పారిస్ లో జరిగిన ఒక ఫ్యాషన్ వీక్ కు హాజరైన కిమ్ కారు దిగిన వెంటనే చుట్టుముట్టిన బౌన్సర్లను తోసుకుంటూ ఆమె దగ్గరవరకూ వెళ్లిన విటాలి సెడాక్ ఆమె పిరుదులపై ముద్దులు పెట్టే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే తేరుకున్న బౌన్సర్లు ఇతగాడి ఆశలను ఆవిరి చేస్తూ అతడిని వెనక్కిలాగి, నేలపై పడేసి చితక్కొట్టేశారు! అది జరిగి నాలుగు రోజులైందో లేదో ఇంతలోనే ఆమెకు మరో షాక్... పాపం కిమ్!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/