భళ్లాల దేవ లాక్ అయ్యాడు! రానా దగ్గుబాటి తనకు కాబోయే భార్యను పరిచయం చేయడమే గాక.. నిశ్చితార్థానికి ముహూర్తం ఇంకెంతో దూరంలో లేదని చెప్పకనే చెప్పాడు. డిజైనర్ మిహీకా బజాజ్ ని పెళ్లాడబోతున్నానని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించగానే ..అభిమానులు రానా లేడీ లవ్ గురించి మరింత తెలుసుకోవడానికి సోషల్ మీడియాలు వెతికారు. ఇంతకాలం గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం సాగించిన రానా ఫియాన్సీ గుట్టు మట్లు కనిపెట్టేందుకు ట్రై చేశారు. అసలింతకీ రానా ఫియాన్సీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఏం చదువుకుంది? ఏ వృత్తిలో కొనసాగుతోంది? మమ్మీ డాడీ ఏం చేస్తారు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మిహీక... బంటీ- సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె. మిహీకా చెల్సియా విశ్వవిద్యాలయం నుండి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆమె ఇంటీరియర్ డిజైన్ .. డెకార్ బిజినెస్ స్పెషలిస్ట్. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియోను మిహీక స్వయంగా నడుపుతున్నారు. ఈ సంస్థ వివాహాలు .. ఇతర కార్యక్రమాలను కూడా ప్లాన్ చేస్తుంది.
అలాగే మిహీక ఇన్ స్టా సహా రకరకాల ఇంటర్వ్యూలు పరిశీలిస్తే తన అభిరుచులు సహా పలు ఆసక్తికర సంగతులే తెలిశాయి. ముఖ్యంగా డిజైనింగ్ పైనా.. వంటకాలపై ఆసక్తి రివీలైంది. అంతేకాదు.. మిహీక చిన్నప్పటి నుంచి ఖరీదైన నగరాల్లో డిజైనర్ ప్యాలెస్ ల సందర్శనతో కలర్ ఫుల్ గానే సాగింది. తన చిన్ననాటి జ్ఞాపకాల్లో సందడిగా ఉండే మార్కెట్లు .. అద్భుతమైన ప్యాలెస్‌ల సందర్శనలతో నిండి ఉన్నాయిట. భారతదేశంలో తన తల్లిగారు డిజైనింగ్ రంగంలో ఆసక్తిగల పురాతన కలెక్టర్ (వస్తు సేకరణ) అని కూడా అభివర్ణించారు. తన మాటల్ని బట్టి తల్లి అభిరుచి తనకు అబ్బింది. తాను డిజైనింగ్ రంగంలోకి వెళ్లేందుకు తన మాతృమూర్తినే స్ఫూర్తి అని అర్థమవుతోంది.
ఓసారి ఇన్ స్టా పోస్ట్ లో మిహీక చెప్పుకొచ్చిన విషయాలు ఆసక్తికరం. ``పువ్వులు.. గుర్రాలు.. రాజభవనాలు లేదా చక్కటి ఆభరణాలు లేదా వాస్తుశిల్పంపై ప్రేమను కలిగి ఉన్నా.. పాతకాలపు కాలాతీతమైన ప్రతిదానిపైనా నాకు ఆసక్తి. చెల్సియా విశ్వవిద్యాలయం నుండి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పుచ్చుకున్న అనంతరం ఈవెంట్ డెకర్ వైపు నేను సహజంగానే ఆలోచించాను. ఆ రంగంలో పురోగతిని సాధించాను. క్లయింట్ కలను సాకారం చేసే పనిలో అనుభవం ఘడించాను`` అని తెలిపారు. అంటే మిహీక ఇప్పటికే బెస్ట్ ఎర్నర్ అని కూడా అర్థం చేసుకోవచ్చు.
మిహీక మామ్ బంటీ ఒక మంచి శిక్షకురాలు కూడా. జ్యువెలరీ బ్రాండ్ అయిన క్రిసాలా ఆభరణాల డైరెక్టర్ & క్రియేటివ్ హెడ్ తను. మిహీకా తన విజయం వెనక తన తల్లి ఉందని చెబుతారు.``నేడు డ్యూడ్రాప్ డిజైన్ స్టూడియో మీ వల్లనే .. ఒక అమ్మాయి తల్లి లేకుండా ఏమీ చేయలేదు!`` అంటూ ఎమోషనల్ పోస్ట్ ని ఇన్ స్టాలో రివీల్ చేశారు.
2018లో యు అండ్ ఐ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిహీకా బజాజ్ ఇలా అన్నారు. ``ఆహారంపైనా నాకు ఆసక్తి. కాబట్టి వంట చేయడం నాకు ఇష్టమైన హాబీలలో ఒకటి. నాకు పుస్తకాలు చదవడం కూడా చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడు రాయడాన్ని ఆనందిస్తాను. సమీప భవిష్యత్తులో లగ్జరీ గిఫ్టింగ్ కు అంకితమైన సంస్థను ప్రారంభించాలని నేను ప్లాన్ చేస్తున్నాను`` అని తెలిపారు. మొత్తానికి మిహీక లాంటి బెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ ని ఏరి కోరి రానా పెళ్లాడేయబోతున్నాడన్నమాట. ఫ్యాన్స్ కి ఇంతకంటే వివరాలు ఇంకేం కావాలో?