తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగభరణం’ సినిమాకు అటు కన్నడలో.. ఇటు తెలుగులో ఇంత క్రేజ్ వస్తుందని తాను అస్సలు ఊహించలేదంటున్నాడు సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ. రమ్య.. దిగంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ గ్రాఫిక్స్ ప్రధాన చిత్రం కొంత కాలంగా చర్చనీయాంశం అవుతోంది. కోడి రామకృష్ణ గ్రాఫిక్స్ సినిమాలు తీయడం కొత్తేమీ కాదు కానీ.. ఇందులో దివంగత నటుడు విష్ణువర్ధన్ రూపాన్ని రీక్రియేట్ చేసి పది నిమిషాల పాటు ఆ పాత్రను తెరమీద చూపించారన్న సమాచారం ఈ సినిమాకు హైప్ తీసుకొచ్చింది. ఈ నెల 14న కన్నడ.. తెలుగు భాషల్లో రిలీజవుతున్న ఈ చిత్రం గురించి కోడి రామకృష్ణ ఏమంటున్నాడంటే..
‘‘నేను తెలుగులో చేసిన చాలా సినిమాలు వేరే భాషల్లోకి డబ్ అయ్యేవి. ఐతే ఈసారి కన్నడలో చేసిన ఓ సినిమా తెలుగులో వస్తోంది. ఇది కన్నడ సినిమా అయినా.. నిర్మాతలు తెలుగు వర్షన్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుని చేశారు. తెలుగులో 600 థియేటర్లలో రిలీజవుతోంది. నా సినిమాలన్నింటికీ విడుదల సమయంలో మంచి క్రేజ్ ఉంటుంది. ఐతే ‘నాగభరణం’ విషయంలో ఈ స్థాయి క్రేజ్ అస్సలు ఊహించలేదు. ఇప్పుడు కర్ణాటకలో ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. తెలుగులో కూడా అంతే హైప్ వచ్చింది. విష్ణువర్ధన్ గారిని పునఃసృష్టించడమే ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి కారణం. చనిపోయిన వ్యక్తిని ఇలా మళ్లీ ఆవిష్కరించడం అన్నది ఇండియన్ సినిమాలో అతి పెద్ద ప్రయోగం. విజువల్స్ చూశాక విష్ణువర్ధన్ గారి భార్య ఏడ్చేశారు. చివరి 15 నిమిషాల్లో ఒక బలమైన పాత్ర కథను మలుపు తిప్పుతుంది. ఆ పాత్రలోనే విష్ణువర్ధన్ గారిని చూపించాం’’ అని కోడిరామకృష్ణ చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/