కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్థన్ మరణించి చాలా సంవత్సరాలైంది. అప్పట్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు. అయితే, ఎప్పుడో మరణించిన విష్ణువర్థన్ తో ఇప్పుడు సినిమా తెరకెక్కించారు దర్శకుడు కోడి రామకృష్ణ! వినడానికి ఆశ్చర్యంగా వింతగా ఉన్నా దీన్ని నిజం చేశారు. ‘నాగర హావు’ అనే చిత్రంలో విష్ణు వర్థన్ మళ్లీ నటిస్తున్నారు! గ్రాఫిక్స్ మాయాజాలంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు కోడి రామకృష్ణ. నాగరహావు ట్రైలర్ తాజాగా యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే రెండు లక్షల వ్యూస్ మార్కును దాటేసింది. ట్రైలర్ చూసినవారంతా విష్ణువర్థన్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు, గ్రాఫిక్స్ కూడా బాగున్నాయంటూ మెచ్చుకుంటున్నారు.
నిజానికి ఈ నాగర హావు చిత్రం 1972లో వచ్చింది. హీరోగా విష్ణువర్థన్ నటించారు. ఆ తరువాత ఇదే చిత్రాన్ని హీరో ఉపేంద్ర కూడా రీమేక్ చేశారు. ఇప్పుడు మూడోసారి ఇదే టైటిల్ తో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తాజా చిత్రం వస్తోంది. 2009లో మరణించిన విష్ణువర్థన్ ని వెండితెరపై పునరావిష్కృతం చేసేందుకు 576 మంది గ్రాఫిక్స్ నిపుణులు అహర్నిశలూ శ్రమించారు. ఇంత భారీ గ్రాఫిక్స్ టీమ్ తో దాదాపు 730 రోజులు పనిచేయించారు దర్శకుడు కోడి రామకృష్ణ. మొత్తంగా రూ. 40 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో నాగాభరణం పేరుతో వస్తోంది. అలాగే - హిందీ - తమిళ భాషల్లో కూడా డబ్బింగ్ అవుతోంది. ఏకకాలంలో నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక, ట్రైలర్ యూ ట్యూబ్ లో వచ్చిన దగ్గర నుంచి కన్నడ నాట ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే, ఎప్పుడో ఏడేళ్ల కిందట మరణించిన స్టార్ హీరోతో ఇప్పుడు సినిమా అంటే అద్భుతమే కదా! ఈ అద్భుతం ఎలా ఉంటుందో అని అక్కడ అందరూ ఎదురుచూస్తున్నారు. తెలుగులో కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అరుంధతి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తెరకెక్కించిన దర్శకుడు కోడి రామకృష్ణ మరోసారి గ్రాఫిక్ మాయాజాలం చేయడం ఖాయం అనే అంచనాలను పెంచేలా ట్రైలర్ అలరిస్తోంది.
Full View