గ్రాఫిక్స్ ను బేస్ చేసుకుని సినిమాలు తీయడం ఇప్పుడు బాగా కామన్ అయిపోయింది. బాహుబలి చూశాక గ్రాఫిక్స్ ని ఏ రేంజ్ లో ఉపయోగించుకోవచ్చో అందరికీ అర్ధమైంది. ఆ రేంజ్ లో అందరూ వాడేయగలరని కాదు కానీ.. ఏ బెంచ్ మార్క్ అయితే సెట్ చేశాడు రాజమౌళి. కానీ.. జక్కన్న కంటే ముందే టాలీవుడ్ కి గ్రాఫిక్స్ పవర్ ఏంటో చూపించిన దర్శకుడు కోడి రామకృష్ణ. 1990ల్లోనే అమ్మోరు.. దేవి అంటూ గ్రాఫిక్స్ తో వండర్ చేసిన కోడి సారు.. రీసెంట్ గా నాగభరణం అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
'ప్రస్తుతం పుట్టపర్తి సాయిబాబాపై భక్తి సినిమా చేస్తున్నాను. ఇది కాకుండా మరో రెండు ప్రాజెక్టులకు కథలు సిద్ధంగా ఉన్నాయి. నేను ఖాళీగా ఉండడం ఊహించుకోలేను. ఫిట్ గా ఉన్నంతకాలం సినిమాలు తీస్తూనే ఉంటా' అంటున్న కోడి రామకృష్ణ.. 'ఇప్పటికే పుట్టపర్తి సాయిబాబా జీవితంపై సినిమా మరో ఐదారు నెలల షూటింగ్ తో మొత్తం కంప్లీట్ చేయనున్నాం. బాబా పాత్ర చేస్తున్న శ్రీజిత్ అద్భుతం గా నటిస్తున్నాడు' అంటున్నాడు.
మొదట ఈ పాత్రకు దిలీప్ ను తీసుకుందామని అనుకున్న కోడి రామకృష్ణ.. అతని స్టార్ డం బాబా పాత్రను డామినేట్ చేస్తందనే ఉద్దేశ్యంతోనే శ్రీజిత్ కి మొగ్గినట్లు చెప్పాడు. మరోవైపు పుట్టపర్తి సత్య సాయిబాబా జీవితం రోజుల వయసు నుంచి ఆయన మరణం వరకూ మొత్తం జీవితాన్ని సినిమాలో చూపించబోతున్నారట కోడి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/