ప్రతి శుక్రవారం థియేటర్లకు కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. తెలుగు భాష సినిమాలు మాత్రమే కాకుండా అన్ని భాషల సినిమాలు కూడా ఎక్కువ శాతం శుక్రవారం విడుదల అవుతూ ఉంటాయి. ఈ శుక్రవారం కోలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల వారు ఎప్పటికి గుర్తుండి పోయేదిగా నిలిచింది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఈవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
సాదారణంగా ఒకటి లేదా రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు విడుదల అయితేనే జనాలు వాటిని పట్టించుకుంటారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. కానీ ఈ వారం ఏకంగా నాలుగు లేడీ ఓరియంటెడ్ సినిమాలు విడుదల అవ్వడం.. పైగా ప్రతి ఒక్క సినిమా కూడా దేనికి అదే అన్నట్లుగా చాలా స్పెషల్ అవ్వడంతో ఈ వారం స్పెషల్ గా నిలుస్తుంది.
ఇక కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ నాలుగు లేడీ ఓరియంటెడ్ సినిమాల విషయానికి వస్తే... త్రిష ప్రధాన పాత్రలో శరవణన్ దర్శకత్వంలో 'రాంగి' అనే చిత్రం రూపొందింది. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మించడంతో మొదటి నుండి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. సి సత్య ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.
తమిళంతో పాటు తెలుగు లో కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్. ఈ అమ్మడు ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'డ్రైవర్ జమున'. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.
సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన ఓహ్ మై ఘోస్ట్ సినిమా కూడా నేడే కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా లో కీలక పాత్రలో యోగి బాబు నటించడంతో మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా థ్రిల్లర్ గా ఉంటుందని మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. అంతా అనుకున్నట్లుగా ఈ సినిమా నవ్విస్తూ భయపెడుతుందట.
ఇక చివరిగా సీనియర్ నటి కోవై సరళ కీలక పాత్రలో నటించిన విభిన్నమైన చిత్రం సెంబి. ప్రభు సోలమన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కువ జరగలేదు. కానీ కోవై సరళ ను ఇష్టపడే వారు ఈ సినిమా కోసం మొదటి నుండి ఆసక్తిగా ఎదురు చూశారు.
మొత్తానికి ఈ నాలుగు సినిమాలు కూడా ఈ వారం బాక్సాఫీస్ వద్ద విడుదల కావడంతో అరుదైన ఘనత దక్కించుకున్నాయి. ఒకే సారి నాలుగు లేడీ ఓరియంటెడ్ సినిమాలు విడుదల అవ్వడం అరుదుగా జరుగుతుంది. కనుక కోలీవుడ్ బాక్సాఫీస్ కు ఈ వారం చాలా స్పెషల్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.