దర్శకుడికి అత్యున్నత పురష్కారం కోసం 38 మంది జాతీయ అవార్డు విజేతల లెటర్
తమిళ ప్రముఖ దర్శకుడు భారతిరాజాకు సినీ అత్యున్నత పురష్కారం అయిన దాదాసాహెబ్ పాల్కే అవార్డును ఇవ్వాల్సిందిగా కోరుతూ 38 మంది కోలీవుడ్ ప్రముఖులు భారత సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు లెటర్ రాశారు. ఈ 38 మంది కూడా గతంలో జాతీయ అవార్డు సాధించిన వారే. అంత మంది జాతీయ అవార్డు గ్రహీతలు భారతిరాజాకు అత్యున్నత పురష్కారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ లేఖ రాయడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.
42 సినిమాలు తీసిన భారతిరాజా ఆరు సార్లు జాతీయ అవార్డును దక్కించుకున్న గొప్ప ఫిల్మ్ మేకర్స్ ఇప్పటికే ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రద్మశ్రీ అవార్డును ఇచ్చి గౌరవించింది. ఇప్పుడు ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పాల్కే అవార్డు కూడా ఇచ్చి ఆయన ప్రతిభను గుర్తించాలంటూ ఆ 38 మంది జాతీయ అవార్డు గ్రహీతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
కేంద్ర మంత్రికి లేఖ రాసిన వారిలో కమల్ హాసన్.. మణరత్నం.. ధనుష్.. బాల.. శ్రీకర్ ప్రసాద్.. సుహాసిని.. సముద్రఖని ఇంకా పలువురు ఉన్నారు. 78వ ఏట అడుగు పెట్టబోతున్న భారతిరాజాకు ఈ అవార్డును ఇవ్వాలనే విజ్ఞప్తిని తమిళ సినీ ప్రముఖులు చేశారు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తికి ఎలా రెస్పాండ్ అవ్వనుందో చూడాలి.