కోలీవుడ్ టాక్‌.. పెళ్లికి త్రిష‌ గ్రీన్ సిగ్న‌ల్..!

Update: 2021-02-14 03:30 GMT
సీనియర్ హీరోయిన్ త్రిష పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా? అంటే అవున‌నే కోలీవుడ్ లో ప్ర‌చార‌మ‌వుతోంది. త్రిష‌పై గ‌త కొద్దిరోజులుగా ర‌క‌ర‌కాల ఊహాగానాలు షికార్ చేస్తున్నాయి. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ కోలీవుడ్ హీరోని త్రిష పెళ్లాడేందుకు రెడీ అవుతోంద‌ని ప్ర‌చార‌మైంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు.

ఇప్ప‌టికే ఏజ్ 38. అందుకే కెరీర్ కంటే వ్య‌క్తిగ‌త జీవితానేకే త్రిష ప్రాధాన్య‌త‌నిస్తున్నారన్న ప్ర‌చారం ఉంది. తెలుగు- తమిళ ప‌రిశ్ర‌మ‌ల్లో అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌నా న‌టించిన త్రిష ఇటీవ‌ల చిరంజీవి స‌ర‌స‌న న‌టించేందుకు అంగీక‌రించింద‌ని ప్ర‌చార‌మైంది. ఆచార్య నెక్ట్స్ మూవీకి త్రిష పేరు పరిశీలిస్తున్నార‌న్న టాక్ వినిపించింది.

ఇక‌పోతే త్రిష కెరీర్ కి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లాడేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే అధికారికంగా ఎలాంటి స‌మాచారం లేదు. నిర్మాత కం బిజినెస్ మేన్ వ‌రుణ్ మ‌ణియ‌న్ తో పెళ్లి క్యాన్సిల్ అయ్యాక త్రిష తిరిగి కెరీర్ కోస‌మే ప్ర‌య‌త్నించారు. కానీ ఇటీవ‌ల త‌న మ‌న‌సు మారి పెళ్లికి సిద్ధ‌మ‌య్యార‌న్న వార్త‌లు ఏమేర‌కు నిజమో తానే చెప్పాల్సి ఉంటుంది. 
Tags:    

Similar News