యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్`. ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నఈ మూవీని రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. భారతీయ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం కోసం రాజమౌళి పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్న ప్రచారం సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ ని క్రియేట్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్‌ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తూ ఈ సినిమా కోసం అత్యంత ఆసక్తిగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం వదులుతున్నారు. ఇదిలా వుంటే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో దాగి వున్న హిడెన్ సీక్రెట్ లపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రధానంగా ట్రైలర్ లో రాజీవ్ కనకాల... ఎన్టీఆర్ పాత్రని వివరిస్తూ చెప్పే సన్నివేశాలు.. ఆ వెంటనే .. లంగోటా ధరించి పులిలా అరణ్యంలో పరుగెడుతున్న ఎన్టీఆర్ ని చూపించిన తీరు.. బ్యాగ్రౌండ్ లో వచ్చే బీజీఎమ్ ..పులితో పలి ఆడే ఆటలా చూపించిన తీరు రోమాంచితంగా వుంది.
అంతే కాకుండా వలని చీల్చుకుంటూ ఎన్టీఆర్ పైకి దూసుకొచ్చే టైగర్ అరస్తుంటే అందుకు ధీటుగా ఎన్టీఆర్ అరిచే ఘట్టం.. పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి అంటూ రామ్ చరణ్ ని బ్రిటీష్ పోలీస్ అధికారిగా దించడం...బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నానని చరణ్ చెప్పడం... తనని అరెస్ట్ చేస్తున్న ఎన్టీఆర్ కోసం అతని వర్గం వేళల్లో ఎదురుతిరుగుతుంటే వారిని విచక్షణా రహితంగా చరణ్ కొడుతున్న సన్నివేశాలు... తొక్కుకుంటూ కాదే ఎదురొచ్చినోన్ని ఏసుకుంటూ పోవాలే అంటూ .. బ్రిటీష్ అధికారి దుస్తుల్లో వున్న చరణ్ ని ఎన్టీఆర్ కొడుతున్న సీన్...
బ్రిటీష్ ఇండియా తరుపున పోలీస్ అధికారిగా పని చేస్తున్న రామ్‌చరణ్ ఒక్కసారిగా రియలైజ్ కావడం.. ఎన్టీఆర్ తో కలిసి బ్రిటీష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించి బెబ్బులులై విరుచుకుపడిన తీరు `ఆర్ ఆర్ ఆర్`లో మెరుపులన్నీ భీమ్ పాత్రవే అని చెప్పకనే చెప్పేస్తోంది. ఎవరి ప్రాధాన్యత ఎంతన్నది పక్కన పెడితే కొమరం భీం పాత్రని గర్జించే బెబ్బులిలా రాజమౌళి తీర్చి దిద్దిన తీరుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముగ్ధులవుతున్నారు. డీటైలింగ్ గా ట్రైలర్ ని అనువణువు పరిశీలించిన అభిమానులు చరణ్ ని రామరాజుగా పవర్ ఫుల్ గా చూపించినా ప్రధాన మెరుపులన్నింటినీ ఎన్టీఆర్ కే వదిలేసినట్టుగా కనిపిస్తోందని చెబుతున్నారు.
సినిమాలో ముందు నుంచి బ్రిటీష్ పాలకులకు ఎదురునిలుస్తూ కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ సమర శంఖం పూరిస్తే చరణ్ మాత్రం అల్లూరి గా కనిపించినా బ్రిటీష్ అధికారిగా వారి తరుపున నిలబడటం ... సినిమాలో ఇద్దరి పాత్రలని జక్కన్న మలిచిన తీరు అనుమానాలకు తావిస్తోంది. ఇక సముద్ర ఖని పాత్ర `చాలా ప్రమాదం..ప్రాణాలు పోతాయిరా.. అంటే ....ఆనందంగా ఇచ్చేస్తాను బాబాయ్ ..` అంటూ మారిన రామరాజుగా చరణ్ చెబుతున్న డైలాగ్ లు సినిమాలో చరణ్ పాత్ర ఎలాంటిదో స్పష్టం చేస్తున్నాయి.
అయితే రాజమౌళి ట్రైలర్ లో చూపించింది నాణేనికి ఒక వైపే నని, చరణ్ పాత్రకు సంబంధించిన కీలక ఘట్టాలని కావాలనే దాచారని, అవన్నీ సినిమాలో సర్ ప్రైజింగ్ గా వుంటాయని చెబుతున్నారు. సినిమాలో ఇద్దరి పాత్రలకు సమాన ప్రాధాన్యత వుంటుందని, ఇందులో ఏ హీరో అభిమానులు నిరాశ పడాల్సిన అవసరం లేదన్నది మేకర్స్ నుంచి వినిపిస్తున్న మాట. అదే నిజమైతే ఇద్దరు స్టార్ ల అభిమానులకు పండగే.. కానీ అదే జరగలేదంటే మరో హీరో ఫ్యాన్స్ చేతిలో ట్రోల్ కి గురి కావాల్సిందేనని అభిమానుల్లో ప్రధానంగా వినిపిస్తోంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే జనవరి 7 వరకు వేచి చూడాల్సిందే.