టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. జనవరి 7న భారీ ఎత్తున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేయడం కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన ఒక పుకారు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గతంలో ఎన్టీఆర్ తన సినిమాల్లోనే కాకుండా పునీత్ రాజ్ కుమార్ సినిమాలో కూడా పాట పాడిన విషయం తెల్సిందే. గాయకుడిగా ఎన్టీఆర్ కు మంచి ప్రతిభే ఉంది. అందుకే ఆయనతో ఈ సినిమా కోసం కీరవాణి ఒక పాట పాడించాడనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఎన్టీఆర్ కనుక ఈ సినిమాలో పాట పాడితే ఖచ్చితంగా మంచి హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాని ఇది ఒక మల్టీ స్టారర్ మూవీ.. పైగా ఇద్దరు సూపర్ స్టార్ లు నటించిన సినిమా అవ్వడం వల్ల ఈ సినిమాలో కేవలం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే పాట పాడితే మరో హీరో అభిమానులు నొచ్చుకునే అవకాశం ఉంటుంది. రాజమౌళి ఆ హీరో అభిమానులను నొప్పించే ప్రయత్నం చేస్తాడని ఏ ఒక్కరు ఊహించడం లేదు. ఏం చేసినా.. ఇద్దరికి సమ ప్రాముక్యత ప్రాధాన్యత ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. అదే చివరకు సినిమా ప్రమోషన్ విషయంలో కూడా జరుగుతుందని పరిస్థితులు గమనిస్తుంటే అర్థం అవుతోంది.
ఎన్టీఆర్ కొమురం భీమ్ గా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపించబోతున్న ఈ సినిమా కథను కాని కథనంను కాని ఏ ఒక్కరు ఊహించలేక పోతున్నారు. నిజమైన పాత్రలతో ఊహా జనిత కథను తీసుకుని తెరకెక్కించిందే ఈ సినిమా.
టాలీవుడ్ లో ఈ సినిమా బిగ్గస్ట్ మూవీగా నిలువబోతుంది. బాహుబలి సినిమాను మించిన వసూళ్లు ఈ సినిమా దక్కించుకేనే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా నమ్ముతున్నారు. కేవలం ఇండియన్ భాషల్లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ నుండి సమాచారం అందుతోంది. రికార్డు స్థాయి లో ఈ సినిమా స్క్రీనింగ్ కు ప్రపంచ వ్యాప్త బయ్యర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.