కోన వెంకట్‌ 100% పబ్లిసిటీ!!

Update: 2015-05-23 13:30 GMT
సాధారణంగా కొందరు వ్యక్తులు మీడియా ఇన్‌ఫర్‌మేషన్‌ సోర్స్‌ లేకపోతే న్యూస్‌ సోర్స్‌ అయిపోతుంటారు. ఆ రేంజులోనే తన క్రేజును పెంచుకున్న రచయిత కోన వెంకట్‌. మనోడు రామ్‌గోపాల్‌ వర్మ టైపులో ట్విట్టర్‌లో ఫేసుబుక్కులో ఏ కామెంట్‌ చేసినా కూడా విపరీతమైన రెస్పాన్స్‌ రావడంతో ఇప్పుడు ఏకంగా పబ్లిసిటీ కూడా చేస్తున్నాడు.

మామూలుగా రోజూ జరుగుతున్న హ్యాపనింగ్స్‌, కొత్త ప్రాజెక్టులు, లేకపోతే ఇంటర్‌స్టెల్లార్‌ వంటి బ్రిలియంట్‌ సినిమాలపై నాకర్ధం కాలేదు తొక్కలో సినిమా అని పోస్టింగులు చేయడం.. వగైరా వగైరా వాటితో బిజీగా ఉండే కోన.. ఈ మధ్యన తను పనిచేసిన ఏదైనా కొత్త సినిమా వస్తోందంటే చాలు వెంటనే దానికి విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నాడు. ఇక వచ్చే శుక్రవారం ఈయన రాసిన ''పండగ చేస్కో'' సినిమా విడదులవుతోంది. ఈ సినిమాకు టెక్నీషియలన్లు అందరూ 100%  ఎఫర్ట్‌ పెట్టి తీశారు.. మీరు ఎంజాయ్‌ చేయండి అంటూ ప్రమోట్‌ చేస్తున్నాడు కోన సార్‌. సినిమాలో కంటెంట్‌ ఉంటే టెక్నీషియన్లు 20% ఎఫర్ట్‌ పెట్టినా ఆడుతుంది, అంతేకాని టెక్నీషియలన్లు అందరూ బాగా పనిచేశారు అంటే సినిమా ఆడుతుందా?


Tags:    

Similar News