రీమేక్ అయితే.. క్రెడిట్ ఎలా కోన?

Update: 2015-11-01 07:17 GMT
మొత్తానికి ‘శంకరాభరణం’ రీమేకా కాదా అనే విషయంలో సస్పెన్సుకి తెరపడిపోయింది. మొన్న ఆడియో ఫంక్షన్ సందర్భంగా క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశాడు కోన. తమ సినిమా రీమేక్ అని. బాలీవుడ్లో విజయవంతమైన ‘ఫస్ గయారే ఒబామా’ ఆధారంగానే ‘శంకరాభరణం’ తెరకెక్కించామని.. ఈ సినిమా రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నామని చెప్పాడు కోన. కాబట్టి కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోయినట్లే.

ఐతే ‘శంకరాభరణం’ ట్రైలర్ చివర్ లో టైటిల్ క్రెడిట్స్ చూస్తేనే జనాల్లో కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. ఇందులో కథ - స్క్రీన్ ప్లే -, మాటలు - దర్శకత్వ పర్యవేక్షణ.. అని క్రెడిట్ వేసుకున్నాడు కోన. ‘శంకరాభరణం’ ఓ రీమేక్ అని ఒప్పుకున్నాక కథ - స్క్రీన్ ప్లే క్రెడిట్ ఎలా వేసుకున్నాడన్నది అర్థం కాని విషయం. విజువల్స్ అవీ చూస్తుంటే దాదాపుగా హిందీ సినిమానే దించేసినట్లు అర్థమవుతోంది.

ఇదేదో ఫ్రీమేక్ అయితే కథ క్రెడిట్ తీసేసుకోవచ్చు కానీ.. రీమేక్ రైట్స్ కొని మరీ సినిమా తీశాక కథ క్రెడిట్ తీసుకుంటే బాగోదు కదా. కథలు మార్పులు చేస్తే స్క్రీన్ ప్లే క్రెడిట్ తీసుకుంటే ఓకే కానీ.. కథ తనదే అని ఎలా వేసుకుంటాడో కోన. బహుశా సినిమాలో మూల కథ అంటూ హిందీ రైటర్ పేరు వేస్తాడేమో. ఏదేమైనా ‘శంకరాభరణం’ ట్రైలర్ చూస్తుంటే మాత్రం చాలా ప్రామిసింగ్ గానే అనిపిస్తోంది. హిందీ నుంచి రీమేక్ చేసినా.. ఈ సినిమా ద్వారా కోన పేరు మార్మోగిపోవడం ఖాయం అన్నట్లే ఉంది పరిస్థితి. ఇప్పటికే టీజర్, ట్రైలర్ చూసి కోనను సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు. సినిమా విడుదలయ్యాక మరింతగా పేరొస్తుందేమో కోనకు.
Tags:    

Similar News