టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ ఇండస్ర్టీని ఏల్తున్న సంగతి తెలిసిందే. భారీ ప్రాజెక్టులు - భారీ డీల్స్ సెట్ చేస్తూనే, మరోవైపు తన ఓన్ ప్రొడక్షన్ ని రెయిజ్ చేస్తున్నాడు. సేమ్ టైమ్ శ్రీనువైట్లతో ఎప్పటిలానే ఘర్షణ పడుతూనే ఉన్నాడు. శ్రీనూ తీసిన సినిమాలన్నిటికీ తనే బాధ్యుడు... ఎందుకంటే నేను రాసినది మార్చేసి సినిమా తీయడం వల్ల అది ఇంకేదో అయ్యింది అని నాన్ స్టాప్ గా కామెంట్ చేశాడు.. కాబట్టి ఆ ఫెయిల్యూర్స్ తో తనకేమీ సంబంధం లేదు అన్న సంకేతాలిచ్చాడు.
ఇటీవలి కాలంలో కోన రచయితగా పనిచేసి, శ్రీనువైట్ల తెరకెక్కించిన బ్రూస్ లీ పరాజయం వేళ ఇలాంటి లుకలుకలెన్నో బైటికొచ్చాయి. కారణం ఏదైనా బ్రూస్ లీ వరకూ ఆ ఇష్యూని వదిలేసినా.. మరి అఖిల్ మాటేమిటి? ఈ మూవీతో పాటు ఇందులో డైలాగులు కూడా ఫ్లాపే. కోన రేంజు ఇందులో కనిపించలేదు. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన అఖిల్ మూవీకి వెలిగొండ శ్రీనివాస్ కథ అందించినా, కోన మాటలు రాశాడు. అయితే ఈ సినిమా దర్శకత్వంలోని ఫెయిల్యూర్ వల్ల కూడా బాక్సాఫీస్ వద్ద అంత పెద్ద పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయితే స్ర్కిప్టులో కోన ఇన్వాల్వ్ మెంట్ లేకుండా ఉండదు కాబట్టి అందులో తను కూడా భాగమే. ఈ సంగతిని అతడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా? మరి అఖిల్ మూవీపై ఏమని స్పందిస్తాడో చూడాలి. శంకరాభరణం ప్రమోషన్ మూడ్ లో ఉన్నాడు కాబట్టి అఖిల్ గురించి ఏమీ మాట్లాడడా? మాట వరసకైనా ప్రస్థావించడా..? చూద్దాం..!