మనోళ్ళంతే.. ఏదో ఒక సినిమాను పట్టుకుంటే.. ఆ సినిమాను తామే గొప్పగా నేటివిటీకి మార్చేసి తీసేశాం అనుకుంటారు. కాని నిజానికి వీరిలాగానే చాలామంది ఆలోచించి కాపీ కొడతారని అనుకోరు. సరిగ్గా ఇప్పుడు శంకరాభరణం సినిమా విషయంలో అదే జరిగింది. కాని అప్పుడు ఆ సినిమా చూసుంటే.. ఇప్పుడు కోన వెంకట్ మరింత జాగ్రత్తగా ఏదైనా రాయడానికి స్కోప్ ఉండేదే.
ఓ ఆర్నెల్ల క్రితం సూపర్ స్టార్ కిడ్నాప్ అనే సినిమా వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ అనుకొని కమెడియన్ వెన్నెల కిషోర్ ను కిడ్నాప్ చేస్తారు. మరి కిషోర్ ను కిడ్నాప్ చేస్తే డబ్బులు ఎవరిస్తారు? అందుకే అతని పక్కనే ఉన్న హీరో నందు సలహాలు ఇస్తూ పోతూ ఉంటాడు. ఈ గ్యాంగ్ నుండి వేరే గ్యాంగ్ కు అమ్ముతారు. ఆ గ్యాంగ్ ఇంకొకరికి. అందులో కూడా లేడీ డాన్ ఉంటుంది. ఇక్కడ నిఖిల్ ను అమ్మినట్లే.. అక్కడ కిషోర్ ను అమ్ముతారు.. ఇక్కడ అంజలి ఉన్నట్లే.. అక్కడ శ్రద్దా దాస్.. మక్కికి మక్కీ అవే సీన్లు. అదే లాజిక్కులు. అయితే 'సూపర్ స్టార్ కిడ్నాప్' వర్కవుట్ కాలేదు. మరి అది చూశాకైనా సెకండాఫ్ వర్కవుట్ కాదేమో అనే సందేహం కోన బ్యాచ్ కు వచ్చుండాలి? ఒకవేళ ఆ సినిమా చూసుంటే.. ఇక్కడ సెకండాఫ్ మారేదే.
ఇకపోతే ఈ సినిమా ఫస్టాఫ్ ఏంటంటే.. అప్పుల్లో ఉన్న ఒక ఎన్నారై ఇండియా వచ్చి తన ఆస్తిని అమ్మేయాలని అనుకుంటాడు. కోన-గోపి కలసి రాసిన నాగార్జున గ్రీకువీరుడు కూడా ఇదే కథ. ఇక్కడ అంజలి క్యారెక్టర్ కు అక్కడ నయనతార క్యారెక్టర్ కు మ్యాచింగ్ ఉంది. ఇక 'పండగ చేస్కో' సినిమాలో కూడా ఇలాంటి షేడ్లు ఉన్నాయ్. ఎన్నిసార్లండీ.. అమెరికాలో అప్పులు పాలైపోతే ఇండియాలో ఆస్తిని అమ్మేద్దాం అనుకుంటారు? పాత సినిమాలు తిరగేసుంటే ఆ పాయింట్ వర్కవుట్ కావట్లేదని మీకే తెలిసేదిగా కోన సాబ్...