ఓ పెద్ద ఫ్యామిలీ నుంచి అరంగేట్రం అంటే భారీ హంగామా, పెద్ద బడ్జెట్ - కళ్లు చెదిరే ఈవెంట్లు - ఇండస్ట్రీ నుంచి మహామహుల్లాంటి గెస్టులు.. ఇలా తెగ హడావిడి చేయడం ఆనవాయితీ. కానీ ఈ ట్రెండ్ కి బ్రేక్ కొట్టేసింది నాగబాబు తనయ నీహారిక. సింపుల్ అంటే సింపుల్ గా వెబ్ సిరీస్ తో జనాలకు పరిచయం అయిపోయింది. ముద్దపప్పు ఆవకాయ్ అంటూ నెట్ లో రిలీజ్ అవుతున్న సిరీస్ కు నెటిజనుల స్పందన అనూహ్యంగా ఉంది.
ఒకటి రెండు రియాల్టీ షోలను హోస్ట్ చేసిన అనుభవం - హీరోయిన్ అవాలనే తపన.. ఈ రెండూ నీహారికను హీరోయిన్ ని చేసేశాయి. కాజల్ - చైతు - లక్ష్మి మంచు - నాని - వరుణ్ తేజ్ సహా అనేక మంది టాలీవుడ్ తారలు చేసిన ప్రచారం కూడా ఈమెకు కలిసొచ్చింది. ఈ సిరీస్ కు నీహారిక చాలా కీలకం అంటున్నాడు దర్శకుడు ప్రణీత్ బ్రహ్మడపల్లి. 'ఈ సిరీస్ కు సెల్లింగ్ పాయింట్ నీహారిక ఉండడమే. ఈ కేరక్టర్ కు తను పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది.' అని చెప్పాడు
ముద్దపప్పు ఆవకాయ్ తొలి ఎపిసోడ్ 7.5లక్షల వ్యూస్ దక్కగా.. రెండో సిరీస్ 6.3 లక్షల వ్యూస్ వచ్చాయి. రిలీజ్ కు ముందు ఓవారం కంగారు పడ్డా... విడుదల అయ్యాక వచ్చిన రెస్పాన్స్ తో టెన్షన్ తగ్గిపోయిందని చెప్పాడు డైరెక్టర్. మొదట 12 ఎపిసోడ్స్ చేద్దామని అనుకున్నామని, కానీ ఇప్పుడు 5 ఎపిసోడ్స్ తోనే కంప్లీట్ చేస్తామని చెప్పాడు. తొలి భాగం విడుదలయ్యాక నాగేంద్ర బాబు, వరుణ్ తేజ్ ఫోన్ చేసి అభినందించడాన్ని మాత్రం మర్చిపోలేనని చెప్పాడు ప్రణీత్.