యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' సెట్స్ లో ఉండగానే కొరటాల స్ర్కిప్ట్ ని యంగ్ టైగర్ లాక్ చేసారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాలి. కానీ ఇంతలో తారక్ 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్ లో బిజీగా ఉండటంతో వీలు పడలేదు. తాజాగా సినిమా షూటింగ్ ముహుర్తం ఖారరైనట్లు సమాచారం. ఈనెలాఖరు నుంచి తారక్-కొరటాల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి సమాయత్తం అవుతున్నారుట.
హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ కాలేజ్ సెట్ ని నిర్మిస్తున్నారుట. గత కొన్ని రోజులుగా కొరటాల టీమ్ ఈ సెట్ పైనే వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సెట్ నిర్మాణానికి భారీగానే బడ్జెట్ వెచ్చించినట్లు సమాచారం. మరి ప్రత్యేకంగా కాలేజ్ సెట్ నే వేస్తున్నారు? కాబట్టి కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు సినిమాలో కీలకం కానున్నాయని భావించొచ్చు. మరి ఎన్టీఆర్ ని స్టూడెంట్ గా చూపించబోతున్నారా? కాలేజ్ సెట్ ప్రత్యేకత ఏంటి? అన్నది కొరటాల రివీల్ చేస్తే గాని తెలియదు.
ప్రస్తుతం కొరటాల 'ఆచార్య' రిలీజ్ హడావుడిలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కించిన సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ డిలే..కరోనా వేరియేంట్ల కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు ఈనెల 29న రిలీజ్ ముహుర్తంగా ఫిక్స్ చేసారు. భారీ అంచనాల మధ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దాదాపు 140 కోట్ల బడ్జట్ తో చిత్రాన్ని నిర్మించారు.
రిలీజ్ సమయం దగ్గర పడటంతో కొరటాల ప్రచారానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ఈ సినిమా రిలీజ్ అనంతరం కొరటాల ఫ్రీ అయిపోతారు. అలాగే తారక్ 'ఆర్ ఆర్ ఆర్' సక్సెస్ ని ఆస్వాదిస్తున్నారు. పార్టీలంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ అయితే ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చేస్తాయి.
అటుపై కొరటాల-తారక్ షూట్ లో జాయిన్ అవుతారు. గతంలో ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తారక్ కెరీర్ లోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడా రికార్డుని మళ్లీ ఇదే కాంబినేషన్ బ్రేక్ చేస్తుందన్న అంచనాలున్నాయి.