మిర్చి దారిలోనే భరతుడు

Update: 2018-04-23 17:28 GMT
మహేష్ ఫేస్ లో రెండు సంవత్సరాల తర్వాత నిజమైన సంతోషం కనిపిస్తోంది. కారణం సింపుల్. బ్లాక్ బస్టర్ సక్సెస్.భరత్ అనే నేను విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్న మహేష్ ఇందాకా మీడియాతో ప్రత్యేకంగా జరిపిన సక్సెస్ మీట్ లో చాలా విషయాలే షేర్ చేసుకున్నాడు. రిజల్ట్ పట్ల పూర్తి హ్యాపీగా ఉన్నానని చెప్పిన ప్రిన్స్ స్క్రిప్ట్ గురించి తాము పడ్డ కష్టం గురించి చాలా ఓపిగ్గా బదులు చెప్పాడు. మీడియా అడిగిన ప్రశ్నల్లో భాగంగా ఒక జర్నలిస్ట్ భరత్ అనే నేనులో హోలీ ఫైట్ ఎప్పుడు పెడతారు అని అడిగిన ప్రశ్నకు స్టేజి మీద ఉన్న యూనిట్ మొత్తం షాకయ్యింది. మహేష్ దాన్నే ఆశ్చర్యం రూపంలో వ్యక్తం చేస్తూ మీకెలా తెలుసు అని ఆడగగా వెంటనే కొరటాల శివ మైకు అందుకుని సినిమా బాగా ఆడుతుంది కనక వీలు చూసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో కట్ చేసిన హోలీ ఫైట్ స్పెషల్ సర్ప్రైజ్ గా త్వరలో రాబోతోంది అని కన్ఫర్మ్ అయిపోయింది.

ఇప్పుడు విడుదలైన వెర్షనే మూడు గంటలు ఉండటంతో హోలీ ఫైట్ లాంటి కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ కట్ చేసినట్టుగా కనిపిస్తోంది. సో ఓ రెండు వారాలు దాటాక జోరు తగ్గుతుంది కాబట్టి అప్పుడు జాయిన్ చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో ప్రభాస్ మిర్చి కు కూడా రైన్ ఫైట్ కలిపి అభిమానులు వచ్చేలా చేయటంలో శివ సక్సెస్ అయ్యాడు. శ్రీమంతుడుకి సీన్లు జోడించారు కాని ఫైట్ కాదు. జనతా గ్యారేజ్ విషయంలో కుదరలేదు. ఇప్పుడు భరత్ అనే నేనుకు జోడించే హోలీ ఫైట్ మళ్ళి హై లైట్ అయ్యేలా ఉంది. ఐదున్నర గంటల సినిమాను తగ్గించి మూడు గంటలు చేసామని అసలు భరత్ అనే నేను రెండు భాగాలు చేసుంటే ఇంకా అదిరిపోయేది అంటూ చివర్లో మహేష్ ఇచ్చిన ట్విస్ట్ అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. సో హోలీ ఆడుతూ మహేష్ చేసిన ఆ స్పెషల్ ఫైట్ ఏంటో చూడాలంటె కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు మరి

Tags:    

Similar News