కొరటాల శివ సినిమా అనగానే సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్.. గీత రచయితగా రామజోగయ్య శాస్త్రి పేర్లు ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ‘మిర్చి’ దగ్గర్నుంచి ‘భరత్ అనే నేను’ వరకూ ఈ ఇద్దరే పాటల పని చూసుకున్నారు. వాళ్లతో తనకు అంత కంఫర్ట్ ఉంటుందని.. కథేంటో చెబితే చాలు.. మిగతాదంతా వాళ్లు చూసుకుంటారని.. ఏ టెన్షన్ లేకుండా అద్భుతమైన ఆడియో ఇచ్చేస్తారని అంటున్నాడు కొరటాల శివ. వాళ్లను తన ఆస్థాన సంగీత దర్శకుడు.. ఆస్థాన గీత రచయితలుగా కొరటాల ప్రకటించడం విశేషం. కాబట్టి మున్ముందు కూడా కొరటాల సినిమాలకు వీళ్లే పని చేస్తారని ఫిక్సయిపోవచ్చేమో. ఈ ఇద్దరితో తాను ఎంత సౌకర్యంగా ఫీలవుతానో.. వాళ్లెంత మంచి ఔట్ పుట్ ఇస్తారో ఉదాహరణగా ‘భరత్ అనే నేను’కు సంబంధించి కొన్ని ఉదాహరణలు చెప్పాడు కొరటాల.
‘భరత్ అనే నేను’ సినిమా కథ చెప్పాక.. హీరో ఏదైనా సాధించినపుడు దాన్నొక అచీవ్మెంట్ లాగా ఫీలవ్వడని.. కేవలం తన బాధ్యతను మాత్రమే నిర్వర్తించినట్లు ఉంటాడని.. ఏ ఎగ్జైట్మెంట్ ఉండదని దేవికి చెప్పానని.. దీంతో మామూలుగా తన సినిమాల్లో హీరో ఏదైనా సాధించగానే దేవిశ్రీ తనదైన శైలిలో చాలా ఉత్సాహంగా దరువులతో బ్యాగ్రౌండ్ స్కోర్ చేస్తాడని.. కానీ దానికి భిన్నమైన సౌండ్ ఇచ్చాడని కొరటాల చెప్పాడు. అంత వేగంగా తన ఉద్దేశాన్ని అతను క్యాచ్ చేస్తాడన్నాడు. అప్పుడే ‘భరత్ అనే నేను’ థీమ్ సాంగ్ కూడా ఇచ్చాడని.. తనకేం కావాలో అతడికి అర్థమైపోయిందనే విషయం తనకు అప్పుడే తెలిసిపోయిందని చెప్పాడు. ఇక ఈ ట్యూన్ ఇవ్వగానే రామజోగయ్య దానికి తగ్గ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారని.. నిజానికి ఈ పాట తొలి లైన్లలో భరత్ అనే నేను అనే మాట రావాలన్న ఆలోచన తనకు లేదని.. కానీ ఆ ట్యూన్లో ఆయన కరెక్టుగా ఆ పదాల్ని పేర్చేశారని.. ఇది చూసి తాను ఆశ్చర్యపోయానని కొరటాల వెల్లడించాడు. ఇలా దేవి-రామజోగయ్య జోడీ గొప్ప సమన్వయంతో తన అభిరుచికి తగ్గట్లు పని చేస్తుంది కాబట్టే వాళ్లతోనే తన ప్రతి సినిమా చేస్తున్నానని చెప్పాడు కొరటాల.