స్టార్ డైరెక్టర్ కొరటాల శివ భారీ అంచనాల మధ్య చేసిన చిత్రం `ఆచార్య`. ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఫ్యాన్స్ ని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీంతో కొంత డిజప్పాయింట్ కి గురైన కొరటాల శివ ఈ మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ భారీ మూవీకి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. `ఆచార్య` డిజాస్టర్‌గా మారడంతో ఎన్టీఆర్ 30 పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారట. `ఆచార్య` ఫలితం నేపథ్యంలో ఎన్టీఆర్ - కొరటాల సినిమాపై రక రకాల వదంతులు పుట్టుకొచ్చాయి.
ఈ ప్రాజెక్ట్ వుంటుందా?. ప్రజెంట్ వున్న పరిస్థితి కారణంగా ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందని, `ఆచార్య` సెటిమెంట్స్ తరువాతే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం వుందంటూ రకరకాల గాసిప్ లు వినిపించాయి. అయితే స్టార్ డైరెక్టర్ వీటన్నింటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. చాలా లైట్ తీసుకుని ఎన్టీఆర్ 30 మూవీ కోసం శ్రమిస్తున్నారు. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే.
ఇదే రోజు ఎన్టీఆర్ 30 వ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసి ఈ ప్రాజెక్ట్ పై ఫుల్ క్లారిటీని ఇవ్వబోతున్నారట కొరటాల శివ. గత కొన్ని రోజులగా దీనిపై ప్రత్యేకంగా ఆయన వర్క్ చేస్తున్నారట. కాన్సెప్ట్ పోస్టర్ తో ఈ మూవీ విషయంలో తాము ఎంత కాన్ఫిడెంట్ గా వున్నామో ఎంత కసితో వర్క్ చేస్తున్నామో స్పష్టం చేయబోతున్నారట. గత చిత్రాలకు మించిన కసి, పట్టుదలతో ఎన్టీఆర్ 30 కోసం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ వర్క్ చేస్తున్నారని చెబుతున్నారు.
సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ మూవీని తెరపైకి తీసుకరాబోతున్నారు. పాన్ ఇండియా వైడ్ కాన్సెప్ట్ కావడంతో ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ట్రిపుల్ ఆర్ తరువాత చేస్తున్న సినిమా అదే స్థాయిలో వుండాలని ఎన్టీఆర్ కూడా భావిస్తుండటంతో ఈ మూవీ పాన్ ఇండియా రిలీజ్ గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారట.
ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. మే 20న కనీవినీ ఎరుగని స్థాయిలో ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ని ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా విడుదల చేసి ఈ మూవీపై వస్తున్న రూమర్ లకు ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మే 20 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.