విజయం మత్తు లాంటిది. ఒకసారి అలవాటు పడితే ఎప్పుడూ అదే కావాలనిపిస్తుంది. ఆ కాంక్షే మరిన్ని విజయాలకు అవకాశంగా మారుతుంది. కానీ.. విజయంతో వచ్చే పేరు ప్రఖ్యాతులు మహా చెడ్డవి. వాటిని దగ్గరకు రానివ్వటం అంటే అపాయాన్ని ఆహ్వానించినట్లే. పేరు ప్రఖ్యాతులు ఎన్ని వచ్చినా..వాటి స్వీకరిస్తే వచ్చే ఇబ్బందులెన్నో. ఆ విషయాలపై శాతకర్ణి దర్శకుడు క్రిష్ కు క్లారిటీ ఉన్నట్లుగా ఉంది.
అందుకేనేమో.. ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నారు. సంక్రాంతికి విడుదలైన శాతకర్ణి సినిమాకు సంబంధించి ప్రమోషన్ వర్క్ లో మలి విడత మొదలైంది. సినిమా విడుదలకు ముందు.. విడుదలైన తర్వాత చానళ్లతో ప్రేక్షకుల ముందుకురావటం.. సినిమా గురించి.. సినిమా సక్సెస్ గురించి మాట్లాడటం.. సినిమా మీద ఆసక్తి మరింత పెరిగేలా చేయటం మామూలే. అదే పనిని చేస్తున్న శాతకర్ణి టీంలో దర్శకుడు క్రిష్ తీరు కాస్త భిన్నంగా ఉందని చెప్పాలి.
సినిమా విడుదలయ్యాక ఈ సినిమాతో క్రిష్ కు వచ్చిన పేరు ప్రఖ్యాతులు అన్నిఇన్ని కావు. అతి తక్కువ వ్యవధిలో సినిమాను ఇంత అద్భుతంగా తీయటాన్ని ప్రతిఒక్కరూ పొగిడేయటమే కాదు.. క్రిష్ తో పోలిక పెట్టి స్టార్ దర్శకుడు రాజమౌళిని తిట్టేసే పరిస్థితి. ఇక.. బాలకృష్ణ లాంటి అగ్రహీరో శాతకర్ణిలో హీరో అయినప్పటికీ.. ఆయనకంటే కూడా దర్శకుడికి ఎక్కువ పేరు రావటం.. ఆయన ఖాతాలో భారీగా పేరు ప్రఖ్యాతులు జమ అవుతున్నాయి.
ఇలా క్రెడిట్ అయిన పేరు ప్రఖ్యాతుల్ని.. బాలకృష్ణ ఖాతాలోకి ట్రాన్సఫర్ చేస్తున్న తీరు ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి. మలి విడత మీడియా ప్రమోషన్ లో భాగంగా.. సినిమా సక్సెస్ కావటం దగ్గర నుంచి బాలకృష్ణ వందో సినిమాకు తాను దర్శకుడ్ని కావటం తనకు దక్కిన అతి గొప్ప అవకాశంగా చెప్పుకోవటం కనిపిస్తోంది. శాతకర్ణి ప్రాజెక్టు మొత్తం బాలయ్య భుజస్కందాల మీద నడిచిందని..ఈసినిమాకు సంబంధించిన క్రెడిట్ మొత్తం ఆయనకే సొంతంగా క్రిష్ అభివర్ణించటం చూసినప్పుడు ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నారన్నది ఇట్టే అర్థమవుతుంది. ఇలాంటి తీరే.. మరిన్ని అవకాశాల్ని.. మరింత ఎత్తుకు ఎదిగేలా చేస్తుందనటంలో సందేహం లేదు.