క్రిష్‌ కాకుండా రాజమౌళి దర్శకుడు అయ్యింటే..

Update: 2019-01-09 11:30 GMT
క్రిష్‌ సినిమాలు అద్భుతంగా తీస్తాడు. మంచి సెన్సిబిలిటీ ఉన్న దర్శకుడు. ఇప్పటివరకు  చాలా సినిమాలు తీసి పేరు తెచ్చుకున్నాడు. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి డౌట్స్‌ లేవు. కానీ క్రిష్‌ తీసిన ఏ సినిమా ఇప్పటివరకు చరిత్ర సృష్టించలేదు. కొన్నాళ్లపాటు మాట్లాడుకునేలా చేయలేదు. దానికి కారణం.. క్రిష్‌. కొన్ని సీన్స్‌ని అద్భుతంగా రాసుకుని.. ఆ సీన్స్‌ ని హీరోలకు చెప్పి మెప్పించే క్రిష్‌.. సినిమా మొత్తాన్ని రాజమౌళిలా నడిపించడంలో మాత్రం ఇబ్బంది పడుతుంటాడు.

ఎన్టీఆర్ సినిమాలో మనకు ఒళ్లు గగుర్పొడిచేలా తీయాల్సిన సీన్స్‌ చాలానే ఉన్నాయి. అందులో ఒకే ఒక్క సీన్‌ ని మాత్రం క్రిష్‌ వాడుకున్నాడు. మిగిలిన సీన్స్‌ అన్నీ సినిమాలో వస్తుంటాయి పోతుంటాయి. ముందు సీన్‌ కు - తర్వాతి సీన్‌ కు సంబంధమే ఉండదు. ఓవరాల్‌ గా బాగానే ఉందనిపిస్తుంది కానీ సినిమా పూర్తైన తర్వాత థియేటర్‌ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఏదో తెలీని చిన్న అసంతృప్తి. దాన్ని కనిపెట్టిన వాడు రాజమౌళి. రాజమౌళి తన సినిమాలో ప్రతీ సీన్‌ లో మనల్ని ఇన్‌ వాల్వ్‌ చేస్తాడు. ఒక అద్భుతమైన సీన్‌ కు ముందు ఎమోషన్‌ ని పెంచే సీన్స్‌ ని క్రియేట్‌ చేస్తాడు. కథలో మనల్ని భాగం చేస్తాడు. స్క్రీన్‌ పై హీరో ఎమోషన్‌ ని మనకు ఆపాదిస్తాడు. ఫైనల్‌గా మనం ఊహించిన దాని కంటే ఎక్కువ సంతృప్తి పొందేలా చేసి మనల్ని థియేటర్‌ బయటకు పంపిస్తాడు. అందుకే రాజమౌళి నెంబర్‌ వన్ అయ్యాడు. ఈ ఎన్టీఆర్ బయోపిక్‌ కనుక రాజమౌళి చేతిలో పడి ఉంటే.. కథానాయకుడు రేంజ్‌ ఇంకోలా ఉండేది. ఎందుకంటే.. ఆ కథ - ఆ కథానాయకుడికి అంత స్కోప్‌ ఉంది మరి.


Full View

Tags:    

Similar News