ప్రస్తుతం టాలీవుడ్ మాంచి జోష్ లో ఉంది. వరుసగా ఇతర భాషల్లోకి డబ్బింగ్ అయిపోతున్నాయి తెలుగు సినిమాలు. ఇదంతా బాహుబలి ఇచ్చిన బూస్ట్ అని చెప్పాలి. దాని తరువాత వచ్చిన శ్రీమంతుడు - రుద్రమదేవి - బ్రూస్ లీ చిత్రాల డబ్బింగ్ రైట్స్ మంచి రేట్ కే అమ్ముడయ్యాయి.
వరుణ్ తేజ్ తో క్రిష్ రూపొందించిన కంచె కు ఇతర భాషల నుంచి భారీగానే ఆఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన విజువల్స్ తో టీజర్ - ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎంక్వైరీలు ఎక్కువయిపోయాయి. అయితే ఎంతగా ప్రెజర్ వచ్చినా.. క్రిష్ మాత్రం కంచెను తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నాడు. ఆఖరికి రిలీజ్ డేట్ ఇచ్చాక వాయిదా పడి.. 20 రోజుల టైం వచ్చినా.. పక్కభాషలపై కన్నెత్తి చూడలేదు. దీనికి కారణం ఏంటో ఇప్పుడు చెప్పేశారు వరుణ్ తేజ్.
ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ ని.. కంచెని ఇతర భాషల్లో ఎందుకు విడుదల చేయడం లేదనే ప్రశ్న ఎదురైంది. ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉంటుందని, అయితే స్టోరీ టైం ప్రకారం చూసుకుంటే.. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అంచనా వేయలేక పోతున్నామన్నాడు వరుణ్ తేజ్. ఇక్కడ రిజల్ట్ చూశాక మిగతా భాషల్లో డబ్బింగో, రీమేకో తేల్చుతారన్నమాట. హిట్ టాక్ వస్తే మాత్రం.. గతంలో పలికిన రేట్ 4-5 రెట్లు పలుకుతుందనే సెకండ్ యాంగిల్ కూడా ఉందండోయ్.