అలా అయితే ల్యాగ్ లేకుండా ఉండేదా?

Update: 2019-01-10 09:00 GMT
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు' విడుదలైంది.  సినిమాకు మంచి స్పందనే దక్కుతోంది.  రివ్యూ.. రేటింగ్స్ కూడా బాగుతున్నాయి కానీ అందరూ చెబుతున్న ఒకే నెగెటివ్ పాయింట్ సినిమాలో ల్యాగ్ ఉందన్నదే.  అలా స్లో గా లేకుండా రేసీగా స్క్రీన్ ప్లే ఉండాలంటే మాత్రం రెండు భాగాలుగా కాకుండా ఒకే భాగంగా రిలీజ్ చేసి ఉండాలి.

మొదటి భాగాన్ని సినీ జీవితానికి పరిమితం చేసి తెలుగుదేశం పార్టీ ప్రకటనతో ఇంటర్వెల్ కార్డ్ వేసి సెకండ్ పార్ట్ ను సెకండ్ హాఫ్ లా చేసి ఉంటే 'ల్యాగ్' ఉందనే కంప్లైంట్ వచ్చి ఉండేది కాదు.  కానీ ఒకే భాగంగా చేసినప్పుడు సినీ జీవితంలో డీటెయిల్స్ అన్నీ చూపించే అవకాశం ఉండేది కాదు.  ఎన్టీఆర్ నిజాయితీ..  ఎన్టీఆర్ నట జీవితం ఎలా మొదలైంది? ఎలా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగాడు? ఇలాంటివి విపులంగా చూపించే అవకాశం క్రిష్ కు ఉండేది కాదు.  క్రిష్ అవన్నీ ఆలోచించిన తర్వాతే రెండు భాగాలుగా విడుదల చేద్దామనే నిర్ణయం తీసుకొని ఉంటాడు. 

ఏదేమైనా ఎన్టీఆర్ జీవితంలోని ప్రతి అంకం తెలుగువారికి ముఖ్యమైనదే కాబట్టి కాస్త స్లోగా ఉన్నా పట్టించుకోరని ఫిక్స్ అయ్యాడేమో. మొదటి భాగంతో ప్రేక్షకులను మెప్పించిన క్రిష్ అండ్ టీమ్ 'మహానాయకుడు' గా ఎన్టీఆర్ ను ఎలా ప్రెజెంట్ చేస్తారో వేచి చూడాలి.  'కథానాయకుడు' లో పెద్దగా వివాదాలకు.. విమర్శలకు ఆస్కారం లేదు.. కానీ 'మహానాయకుడు' అలా కాదు. విమర్శలకు.. వివాదాలు ఫుల్ గా స్కోప్ ఉంది. మరి ఈ క్లిష్టమైన భాద్యతను క్రిష్ ఎలా నిర్వర్తించాడో వేచి చూడాలి. 
   

Tags:    

Similar News