క్యాస్ట్ విష‌యంలో క్రిష్‌ కామెంట్‌

Update: 2015-10-25 05:41 GMT
కులం - మ‌తం - జాతి - ప్రాంతం అంటూ కొట్టుకు చావ‌డం దేశ‌మంతా ఉంది. ముఖ్యంగా  కులం గొడుగు కిందే తెలుగు రాష్ట్రాలు ఉన్నాయ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. అందుకే క్రిష్ కంచె సినిమాలో కులాల్ని , అవి న‌డిపించే ద‌గుల్బాజీల్ని ఎండ‌గ‌డుతూ ఓ భీక‌ర‌మైన డైలాగ్ రాయించాడు. సాయిమాధ‌వ్ బుర్రా ఈ డైలాగ్‌ ని చాలా తెలివిగా ఎవ‌రినీ కించ‌ప‌రిచేలా కాకుండా వ్య‌వ‌స్థ‌లో ఉన్న దుష్ట‌త్వాన్ని ప్ర‌శ్నిస్తూ కులం జాఢ్యాన్ని క‌డిగేస్తూ బాగా రాశాడ‌న్న ప్ర‌శంస వ‌చ్చింది.

ఒక‌ప్పుడు ఒకే ఒక్క హిట్లర్ ఉండేవాడు. కానీ ఇప్పుడు కులం పేరుతో బోలెడంత‌మంది హిట్ల‌ర్లు ఉన్నారు అన్న‌ది క్రిష్ అభిప్రాయం. తెలుగు రాష్ట్రం ముక్క చెక్క‌లైనందుకు బాధ‌గా లేదు. విడిపోవ‌డానికి నేను వ్య‌తిరేకిని కాను కానీ, కులం పేరుతో కొట్టుకోవ‌డం,  ప్రాంతం పేరు తో తిట్టుకోవ‌డ‌మే బాలేదని క్రిష్ అభిప్రాయ ప‌డ్డాడు. రాజ‌కీయాలు, ఓట్లు అన్నీ కులం ఫ్యాక్ట‌ర్ చుట్టూనే ముడిప‌డి ఉన్నాయి. ఇలా వ్య‌వ‌స్థ‌ను త‌యారు చేశారు దుర్మార్గులు అని క్రిష్ సూటిగా చెప్పాడు. దానిని బేస్‌ చేసుకునే రైటర్ సాయిమాధవ్‌ బుర్రా ఆ డైలాగ్‌ రాశాడు.
Tags:    

Similar News