నందమూరి బాలకృష్ణ వందో సినిమా.. అనూహ్యంగా ఆఖరి నిమిషంలో క్రిష్ చేతికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్న టైంలో.. అనూహ్యంగా క్రిష్ చేతికి ఈ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకున్న గౌతమిపుత్ర శాతకర్ణి.. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాకు బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఝ.. డైరెక్షన్ విభాగంలో అసోసియేట్ గా వర్క్ చేసిన విషయం మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు.
సినిమాకి సంబంధించిన అన్ని విభాగాల్లోనూ ప్రావీణ్యం సంపాదించాలంటే డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో శిక్షణ పొందాలనే ఉద్దేశ్యంతో.. బాలయ్య స్వయంగా ఈ ఏర్పాటు చేశారు. కానీ క్రిష్ దగ్గరే ఇలాంటి ఏర్పాటు జరగడం వెనక ఓ ప్రత్యేకమైన కారణం ఉందని తెలుస్తోంది. మోక్షజ్ఞను టాలీవుడ్ కి పరిచయం చేసే బాధ్యత క్రిష్ చేతిలోనే పెట్టారట బాలయ్య. త్రివిక్రమ్ శ్రీనివాస్.. బోయపాటి శ్రీను.. కొరటాల శివ లాంటి పేర్లు వినిపించినా.. ట్యాలెంటెడ్ అండ్ మెమరబుల్ ల్యాండ్ మార్క్ మూవీస్ అందించే క్రిష్ అయితేనే కరెక్ట్ అని బాలయ్య భావించినట్లు తెలుస్తోంది.
శాతకర్ణి షూటింగ్ సమయంలో మోక్షజ్ఞ-క్రిష్ లకు మంచి అనుబంధం ఏర్పడిందని.. ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారని తెలుస్తోంది. దీన్ని గమనించిన బాలయ్య.. మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేసేందుకు తగిన స్క్రిప్ట్ తో రావాలని సూచించారట కూడా. శాతకర్ణి రిజల్ట్ చూసిన తర్వాత.. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/