వివాదం మెల్లగా ముదురుతోంది

Update: 2019-01-29 08:36 GMT
ఇటీవల విడుదలైన 'మణికర్ణిక' చిత్రంకు మొదట క్రిష్‌ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. అయితే చరిత్రను వక్రీకరించి చూపించాలంటూ కంగనా మరియు నిర్మాతలు ఒత్తిడి చేయడంతో క్రిష్‌ ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. క్రిష్‌ తప్పుకునే సమయానికి మణికర్ణిక చిత్రం షూటింగ్‌ ప్యాచ్‌ వర్క్‌ మినహా మొత్తం పూర్తి అయ్యిందట. క్రిష్‌ బయటకు వచ్చిన తర్వాత కంగనా మిగిలిన బ్యాలన్స్‌ వర్క్‌ ను పూర్తి చేసింది. సినిమాలోని పలు సీన్స్‌ ను రీషూట్‌ చేసిందట. సినిమా విడుదల సమయంలో ఈ చిత్రంలో 75 శాతం తానే చేశానంటూ కంగనా చెప్పుకొచ్చింది.

తాజాగా 'మణికర్ణిక' విడుదలైన తర్వాత ప్రశంసలన్నీ కూడా కంగనానే దక్కుతున్నాయి. ఈ సమయంలో దర్శకుడు క్రిష్‌ ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ చిత్రం షూటింగ్‌ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, నిర్మాత, హీరోయిన్‌ తన పట్ల వ్యవహరించిన తీరు గురించి వ్యాఖ్యలు చేశాడు. దాంతో వివాదం మొదలైంది. మణికర్ణిక విడుదలకు ముందు క్రిష్‌ పెద్దగా స్పందించలేదు, ఇప్పుడు మాత్రం తనకు అన్యాయం జరిగిందని అంటున్నాడు. బాలీవుడ్‌ కు చెందిన వారు కంగనా, క్రిష్‌ వివాదంపై స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు. కాని తాజాగా పూజా భట్‌ ఈ విషయమై స్పందించింది.

ఒకరు చేసిన పనికి డబ్బు ఇచ్చినా ఇవ్వకున్నా గుర్తింపు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. డబ్బు ఉంటుంది, పోతుంది, వారికి గుర్తింపు ఇస్తేనే వారు చేసిన పనికి సంతృప్తి కలుగుతుంది. గుర్తింపు ఇవ్వక పోవడం అనేది ఏ లెవల్‌ లో జరిగినా కూడా దాన్ని సహించకూడదు. సినిమాల్లో చేస్తే గుర్తింపు ఇవ్వాలనేది ఫిల్మ్‌ మేకింగ్‌ లో ఫస్ట్‌ రూల్‌ గా ఉంటుంది. ఆ విషయాన్ని అందరు కూడా గుర్తించాలంటూ పూజా భట్‌ పేర్కొంది. కంగనా మరియు నిర్మాతలపై పూజా చేసిన వ్యాఖ్యలు వివాదం ముదిరేలా చేస్తున్నాయి. ఈ విషయమంలో మరెంత మంది స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News