కృష్ణా.. ఏమీ రొమాంటిక్‌ బ్రహ్మోత్సవాలు!!

Update: 2016-05-11 17:30 GMT
బాలా త్రిపురమణి.. అంటూ సాగే ఓ సాంగ్‌ ఇప్పుడు రేడియోల్లోనూ.. యువత ఫోనుల్లోనూ.. ఎక్కడ చూసినా కూడా తెగ మోగుతోంది. ''బ్రహ్మోత్సవం'' సినిమాలోని ఈ పాట టీజర్‌ లో.. కాజల్‌ నడుముపై మహేష్‌ బాబు చేయవేడంతో.. పెద్ద రచ్చ అయ్యింది. అదేనండీ.. బీభత్సంగా పాపులర్‌ అయ్యింది. అందుకు కారణం మిక్కీ జె మేయర్‌ అందించిన ట్యూన్‌ ఒకెత్తయితే.. దానికి 'రౌడీ ఫెలో' డైరక్టర్‌ కృష్ణ చైతన్య రాసిన లిరిక్‌ మరో కారణం.

''బాలా త్రిపురమణి.. నడుం తిప్పుకొని.. అలా ఎలా కదిలింది?'' అంటూ మొదలయ్యే ఈ పాట లిరిక్‌.. ''తానో కంచి పట్టు.. నాదా పంచ కట్టు.. అయినా జరీ కుదిరింది..'' అంటూ సాగుతుంది. అంతేకాదు.. 'బుద్దుడే యుద్దమే చేసేయడా నిను చూస్తే?' అంటూ కాజల్‌ అందాలను తెగ పొగిడేశాను లిరిక్‌ రైటర్‌ కృష్ణ చైతన్య. సింపుల్‌ మాటలతో.. ఓ కాంటెంపరరీ కవితనే అల్లాడు. మామూలుగా హీరోయిన్‌ ను పొగడటం అంటే కాస్త మకతిక పెట్టే తేటతెలుగు పదాలను కూర్చి గేయ రచయితలు ఇంప్రెస్‌ చేయాలని చూస్తుంటారు. కాని కృష్ణ చైతన్య మాత్రం..  ''లెక్కకు అందని.. తీరిక. గమ్మతయిన ఈ.. గమనిక. ఆపదు ఎందుకో.. నన్నిక.. నీతో తెగించనా తేలిగ్గా'' అంటూ రొమాన్స్ ను చాలా స్ర్టయిట్‌ అండ్‌ సింపుల్‌ గా చెప్పడాన్ని బట్టి చూస్తే.. మనోడిలోని ఆ కవి హృదయం ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. బ్రహ్మోత్సవంలో రొమాన్స్‌ గుప్పించాడని చెప్పుకోవచ్చు.

ఈ పాటనే కాకుండా.. మనోడు పుట్‌ యువర్‌ హ్యాండ్స్‌ అప్‌ అంటూ ఇంకో పాటను కూడా రాశాడు. ఈ పాట.. ఖచ్చితంగా ఏ సమంతదో కాజల్‌ దో ఇంట్రొడక్షన్‌ సాంగ్‌ అనుకుంట..  ''చినుకల్లా కిందకు దూకి.. వానల్లే గడిపేద్దామా??'' అంటూ ఈనాటి యువత లిబరల్‌ వ్యూ ఎలా ఉంటుంది అనే విషయాలను వివరించడానికి ప్రయత్నించాడు చైతన్య. బాగుందమ్మా!!
Tags:    

Similar News