కృష్ణ కోరిక.. వారి బాధ్యత మహేష్ బాబుదే!

Update: 2022-11-18 11:30 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యక్తిగతంగా ఎంత మంచి మనసున్న హీరోనో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా అతను ఎన్నో మంచి పనులు చేసి అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు అతను గుండె సంబంధిత ఆపరేషన్ కు సహాయం చేసిన విషయం తెలిసిందే.

అలాంటి ఆపదలో ఎప్పుడు ఎవరు తలుపు తట్టిన కూడా లేదనకుండా కాదనకుండా మహేష్ బాబు సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు దాదాపు ఘట్టమనేని ఫ్యామిలీకి సంబంధించిన అన్ని బాధ్యతలు కూడా మహేష్ బాబు మీదనే పడినట్లు అనిపిస్తోంది. ఒక విధంగా అతను బాధ్యతగా వాటన్నిటిని సక్రమంగా నిర్వర్తించాలని అనుకుంటున్నాడు.

ఒకే ఏడాదిలో ఘట్టమనేని ఫ్యామిలీలో ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించడం ఒక విధంగా తీవ్ర విషాదమని చెప్పాలి. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తల్లి ఇందిరా దేవి, అలాగే ఇటీవల తండ్రి కృష్ణ మరణించడం మహేష్ బాబును తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.

అయితే రమేష్ బాబు పిల్లల బాధ్యతను పూర్తిగా ఇప్పుడు మహేష్ బాబు తీసుకున్నాడు. ఆయనకు కూతురు కొడుకు ఉన్న విషయం తెలిసిందే.

ఇక కూతురు చదువుకుంటూ ఉండగా ఇంటికి పెద్ద మనవడు అయినటువంటి జయకృష్ణ ఇండస్ట్రీలో హీరోగా పరిచయం చేయాలి అని మహేష్ ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ కోరిక కూడా అదే కృష్ణ. తన సొంత ఖర్చులతోనే జయకృష్ణను అమెరికాకు పంపించి అక్కడ ప్రత్యేకంగా ఫిలిం ఇన్స్టిట్యూషన్స్ లో కోచింగ్ కూడా ఇప్పిస్తున్నాడు.

ఇక ఇప్పుడు కృష్ణ చనిపోవడంతో ఆ బాధ్యతను మహేష్ తీసుకున్నాడు. అసలైతే జయకృష్ణ తన తాత గారి చేతుల మీదుగా హీరోగా ఇండస్ట్రీలోకి పరిచయం కావాలని అనుకున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు ఆ కోరికను నెరవేర్చడానికి సిద్ధమయ్యాడు. ఇక కృష్ణ మూడవరోజు చిన్నకర్మ సందర్భంగా  మహేష్ బాబు తన అన్నయ్య పిల్లలతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News