రుద్రాక్ష.. కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్లాన్ చేసిన మూవీ ఇది. ఇప్పటికే కాస్టింగ్ సహా చాలా కార్యక్రమాలు పూర్తయిపోయాయి కూడా. లీడ్ రోల్ లో మొదట అనుష్కను అనుకున్నా.. తర్వాత సమంతను ఫిక్స్ చేశారు. చాలా సంవత్సరాల తర్వాత భర్త కృష్ణవంశీ డైరెక్షన్ లో నటించేందుకు రమ్యకృష్ణ కూడా ఓకె చెప్పింది. అయితే.. ఇప్పుడీ రుద్రాక్షను కొంతకాలం పాటు వాయిదా వేశాడట కృష్ణవంశీ.
దీనికి కారణం నందమూరి బాలకృష్ణతో వందో సినిమాకు చేసే అవకాశం రావడమే అనే టాక్ వినిపిస్తోంది. బాలయ్య ప్రస్తుతం తన వందో సినిమాకోసం దాదాపు ఐదుగురు డైరెక్టర్లను క్యూలో పెట్టారు. అందులో కృష్ణవంశీ పేరు రేస్ లో ఫస్ట్ ఉంది. చాలా కాలం నుంచి బాలయ్యతో సినిమా చేసేందుకు కృష్ణవంశీ ప్లాన్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఈ డైరెక్టర్ చెప్పిన ఓ స్క్రిప్ట్ సూపర్బ్ గా నచ్చడంతో.. బాలయ్య వెంటనే తన అంగీకారం చెప్పారని, పూర్తి స్క్రిప్ట్ తెస్తే.. వెంటనే సినిమా స్టార్ట్ చేద్దామని అన్నారనే టాక్ వినిపిసతోంది. అలా బాలయ్య వందో సినిమా చేసే ఆఫర్ రావడంతో.. తన ప్రాజెక్టు రుద్రాక్షను కృష్ణవంశీ కొంతకాలం పాటు పక్కన పెట్టాడని తెలుస్తోంది.
నిజానికి ఈ ఏడాది జూన్ నుంచి రుద్రాక్ష షూటింగ్ స్టార్ట్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు బాలయ్య సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ ఫైనల్ అయితే.. మే నెలనుంచే బాలకృష్ణ-కృష్ణవంశీల సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.