'కృష్ణ వ్రింద విహారి' టీజర్: ఇంతకీ మన హీరో వర్జినేనా..??

Update: 2022-03-28 06:04 GMT
నాగశౌర్య హీరోగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''కృష్ణ వ్రింద విహారి''. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో షెర్లీ సెటియా హీరోయిన్ గా నటించింది. ఐరా క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇప్పటికే 'కృష్ణ వ్రింద విహారి' సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈరోజు టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. టీజర్ లో నాగ శౌర్య మరియు షిర్లీ సెటియా ఒక కార్పొరేట్ ఆఫీసులో పనిచేసే సహోద్యోగులుగా కనిపిస్తున్నారు.

షెర్లీ తన పరిసరాల్లోకి వచ్చిన ప్రతిసారీ శౌర్య తన గుండెలో బెల్ సౌండ్ వింటున్నాడు. ఆమెను ఆకట్టుకోవడానికి అతను చేసే ప్రయత్నాలను చూడొచ్చు. ఆమె తన వర్జినిటీ గురించి  ఇద్దరి మధ్య ప్రేమ వికసించిన తర్వాత, షిర్లీ తన స్వంత కారణంతో అతనిని తప్పించుకోవడం ప్రారంభిస్తుంది.

శౌర్య - షెర్లీ మధ్య రొమాంటిక్ ట్రాక్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తోంది. నాగ శౌర్య తొలిసారిగా బ్రాహ్మణ యువకుడి లుక్ లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాయి. షెర్లీ సెటియా చాలా అందంగా కనిపించింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సానుకూలాంశాలు. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేయగా.. రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్షన్ నిర్వహించారు. అలనాటి నటి రాధిక శరత్ కుమార్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - బ్రహ్మజీ - సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

'కృష్ణ వ్రింద విహారి' చిత్రాన్ని శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఉషా మల్పూరి నిర్మిస్తున్నారు. బుజ్జి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.


Full View

Tags:    

Similar News