`జీఎస్టీ` పై కృష్ణంరాజు షాకింగ్ కామెంట్స్ !

Update: 2018-01-20 16:52 GMT
జీఎస్టీ....ఇప్ప‌టి వ‌ర‌కు జీఎస్టీ అంటే చాలామందికి తెలిసిన నిర్వ‌చనం....గూడ్స్ స‌ర్వీస్ ట్యాక్స్. కానీ - వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆ ప‌దానికి ఓ స‌రికొత్త భాష్యం చెప్పిన‌ట్లుగా ఓ వీడియోను తెర‌కెక్కించాడు. అమెరిక‌న్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా తో వ‌ర్మ‌....గాడ్...సెక్స్ ...అండ్ ట్రూత్ (జీఎస్టీ) అనే వీడియోను తెర‌కెక్కించి వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 26న‌ విడుద‌ల కాబోతోన్న జీఎస్టీ ఫుల్ వీడియో ఇపుడు హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, ఆ వీడియోపై టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ - సీనియర్ నటుడు కృష్ణంరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు.  వర్మ ఏ ఉద్దేశంతో జీఎస్టీని తెరకెక్కించాడనే విషయాన్ని గుర్తించాల‌న్నారు. ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా ఆయ‌న అనేక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జాతీయ స్థాయిలో పేరు ప్ర‌ఖ్యాత‌లున్న వర్మను విమర్శించాల్సిన పని లేద‌ని - జీఎస్టీ చూడాల‌ని వర్మ ఎవ‌రినీ బలవంతం చేయడం లేదన్నారు. ప్ర‌స్తుతం దాదాపుగా అంద‌రికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉంద‌ని , ఎవ‌రికి ఏం కావాలంటే అది చూసే వెసులుబాటు ఉంద‌న్నారు. ఈ టెక్ యుగంలో పిల్లలకు తెలియకుండా ఒక విష‌యాన్ని దాచిపెట్ట‌డం క‌ష్ట‌మ‌న్నారు. అలాంటి సినిమాలను చాలామంది చూస్తున్నారన్నారు.

మ‌రోవైపు, ప్రభాస్ పెళ్లి గురించి ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 'బాహుబలి పూర్త‌య్యాక పెళ్లి చేసుకుంటాన‌ని ప్ర‌భాస్ గ‌తంలో చెప్పేవాడ‌ని....తాజాగా 'సాహో' పూర్తి కావాలని పాట పాడుతున్నాడ‌ని చెప్పారు. అయితే, ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తీరులో కొద్దిగా మార్పు వచ్చింద‌ని....పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రావ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. భ‌విష్య‌త్తులో సినిమాలకు 25 శాతం - రాజకీయాలకు 75 శాతం సమయాన్ని కేటాయిస్తానన్నారు. తాను సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయ్యాయ‌ని, త‌న‌ను ఇన్నాళ్లూ ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు స‌దా రుణ‌ప‌డి ఉంటాన‌ని ఆయ‌న చెప్పారు. సహజత్వానికి దగ్గరగా నటించ‌డం వ‌ల్లే అభిమానులు ఇన్నాళ్లూ ఆద‌రించార‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే ఓ వేడుక నిర్వహించి అభిమానులను సన్మానిస్తానని తెలిపారు.

Tags:    

Similar News