ప్ర‌భాస్‌ లో రెబ‌ల్‌ స్టార్ ల‌క్ష‌ణాలు!

Update: 2019-03-08 15:30 GMT
డార్లింగ్ ప్రభాస్ గురించి.. త‌న ఫ్యామిలీ గురించి ఎవ‌రికి ఎంత తెలుసు? అంటే బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది కొంతే. తెలియ‌నిది ఎంతో. మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని  రెబ‌ల్‌ స్టార్ కృష్ణంరాజు భార్యామ‌ణి శ్యామ‌లా దేవి ఓ యూట్యూబ్ చానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని తెలిపారు. కృష్ణంరాజు గురించి.. అలాగే కుమారుడు ప్ర‌భాస్ గురించి ఎన్నో ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని తెలిపారు.

కృష్ణంరాజు గురించి ప్ర‌స్థావిస్తూ.. ఆయ‌న‌తో మాట్లాడటానికి ఎవరైనా సరే చాలా భయపడతారు. గంభీరమైన ఆయన రూపం .. ఆ స్వ‌రం అందుకు కారణం. అయితే ఆయనతో మాట్లాడిన వాళ్లు ఆయన అభిమానులు కాకుండా ఉండ‌లేరు. ఆయ‌న‌లో సున్నిత‌త్వం అంత‌గా న‌చ్చుతుంది.. అని తెలిపారు. రెబ‌ల్ స్టార్ కి స్త్రీలంటే ఎంతో గౌరవం. అదే పద్ధతి ప్రభాస్ కి కూడా వచ్చింది. పెళ్లికి ముందు నన్ను చూడటానికి కృష్ణంరాజుగారు తన కజిన్ ను పంపించారు. ఆ సమయంలో నేను చిన్న పిల్లలతో ఆడుకుంటున్నాను. ఆయన వెళ్లి అదే త‌న‌తో చెప్పారట. ``చిన్నపిల్లలతో ఆడుకునేవారి మనస్తత్వం మంచిదై ఉంటుంది .. పెళ్లికి ఓకే చెప్పండి`` అని కృష్ణంరాజుగారు అన్నారట అని జ్ఞాప‌కాల్లోకి వెళ్లారు శ్యామ‌ల‌.

కృష్ణం రాజును ప్ర‌భాస్ ఏమ‌ని పిలుస్తారు? అంటే.. నాన్న అంటార‌ని.. ప్ర‌భాస్ ని ఆయ‌న‌ బాబు అని పిలుస్తార‌ని తెలిపారు. ఫ్యాన్స్ అంద‌రికీ డార్లింగ్ ప్ర‌భాస్. బంగారం అని పిలుస్తారు అంతా. ప్ర‌భాస్ నిజ‌మైన‌ బంగారం కాబ‌ట్టి అంద‌రినీ బంగారం అని పిలుస్తారు... అని తెలిపారు. కృష్ణంరాజు లోని రెబ‌ల్ స్టార్ ల‌క్ష‌ణాలే ప్ర‌భాస్ కి వ‌చ్చాయ‌ని శ్యామ‌లా దేవి తెలిపారు. ఇక కుటుంబంలో తిండి అల‌వాట్ల‌పై ప్ర‌స్థావిస్తూ.. కుటుంబం అంతా నాన్ వెజ్ ప్రియులం అని వెల్ల‌డించారు.  కృష్ణంరాజు గారు ఏదైనా ఊరికి వెళితే అక్క‌డ షూటింగ్ జ‌రుగుతుంటే ఆ ఊళ్లో ఎవ‌రూ పొయ్యి వెలిగించ‌కూడ‌దు. అక్క‌డ షూటింగ్ చేసిన‌న‌న్నాళ్లు ఆ ఊరంద‌రికి త‌మ‌తోనే భోజ‌నం. కృష్ణంరాజు తండ్రి గారి నుంచి వ‌చ్చిన సిద్ధాంతం అది. దానినే కృష్ణంరాజు అనుస‌రించారు. ప్ర‌భాస్ కూడా అదే అనుస‌రిస్తున్నారు.  అయితే ఓసారి రెబ‌ల్ స్టార్ షూటింగ్ ఓ ఊళ్లో జ‌రిగింది. ఆ ఊళ్లో ఒకాయ‌న రోజూ నాన్ వెజ్ స‌ర‌ఫ‌రా చేసేవారు. అలా షూటింగ్ అయ్యే వ‌ర‌కూ అత‌డే ఇచ్చారు. ఆ త‌ర్వాత‌ ఆయ‌న ఆ డ‌బ్బుతో సొంతంగా ఇల్లు క‌ట్టుకున్నారు... అంటూ రాజుల‌కు నాన్ వెజ్ ప్రియ‌త్వం ఏ రేంజులో ఉంటుందో శ్యామ‌లా దేవి గుట్టు విప్పేసారు.
    

Tags:    

Similar News