కృతిశెట్టి అలియాస్ బేబమ్మ పరిచయం అవసరం లేని బ్యూటీ. తొలి సినిమా `ఉప్పెన`తోనే కుర్రాకారు మనసు దోచిన బ్యూటీ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఉప్పెనలో హాట్ పెర్ఫామెన్స్ విషయంలో తగ్గేదేలే అంటూ మతులు చెడగొట్టిన బ్యూటీ శ్యామ్ సింగరాయ్ లోనూ చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని సరసన రొమాంటిక్ సన్నివేశాల్లో హద్దులు మీరింది. మరోసారి బోల్డ్ అటెంప్ట్ చేసి సక్సెస్ అయింది. సీన్ డిమాండ్ మేరకు సిగరెట్లు సైతం ఊదేసింది. మొత్తంగా మోడ్రన్ గాళ్ లుక్ లో బేబమ్మ యువతని బాగా ఆకట్టుకుంది. ఇటీవలే `శ్యామ్ సింగరాయ్` ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆన్ సెట్స్ లో ఎదురైనా సింగరాయ్ అనుభవాల్ని పంచుకుంది. బోల్డ్ సన్నివేశాల్లో నటించడం కంటే సిగరెట్టు తాగే సన్నివేశాల్లో బాగా ఇబ్బంది పడినట్లు తెలిపింది. సిగరెట్ వాసన అంటే అస్సలు పడదట. ఎవరైనా స్మోక్ చేస్తే వాళ్లకు దూరంగా వెళ్లిపోతుందిట. కానీ `శ్యామ్ సింగరాయ్` లో తానే స్వయంగా స్మోక్ చేయాల్సి వచ్చిందని.. తప్పక సిగరెట్లు నోట్లో పెట్టుకుని ఊదాల్సి వచ్చిందని తెలిపింది. సిగరెట్ సీన్ లో నటించనని దర్శకుడికి చెబితే కృతికి..కీర్తి పాత్రకి తేడా ఎలా చూపిస్తావ్ అని దర్శకుడు సవాల్ విసరడంతో దాన్ని స్వీకరించి చేసి చూపించానని తెలిపింది.
అయితే మరీ ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఆరోగ్య సేతు సిగరెట్టుని దర్శకుడు ప్రత్యేకంగా తనకోసం తెప్పించాడని.. అవి పాల రుచితో ఉంటాయని తెలిపింది. అయితే సిగరెట్టు తాగేటప్పుడు బాగా ఇబ్బంది పడినట్లు తెలిపింది. బోల్డ్ సన్నివేశాలు సినిమాల్లో సహజం. పాత్ర డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో నటించడం తప్పదు. గిరి గీసుకుని కూర్చోవడాలు ఉండవు. నానితో అలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు ఇబ్బంది పడలేదని తెలిపింది. కృతి తదుపరి రామ్ సరసన లింగుస్వామి దర్శకత్వంల నటిస్తున్న సంగతి తెలిసిందే.