బోల్డ్ గా ముచ్చట్లు చెప్పిన బేబమ్మ

Update: 2021-12-27 01:30 GMT
బేబమ్మగానే ఆమె తెర పరిచయం.అదే ఇపుడు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ ఆయింది. శ్యామ్ సింగ రాయ్ తో రెండవ సినిమా చేసి ఓకే అనిపించుకున్న కన్నడ కస్తూరి కృతి శెట్టి బంగర్రాజుతో చేసిన రొమాన్స్ ని త్వరలోనే ముందుకు తేబోతోంది. హీరో రామ్ మూవీలో కూడా హీరోయిన్ గా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ముందు ఆఫర్లు చాలానే ఉన్నాయి.

క్యూట్ గా ఉండే రోల్స్ మాత్రమే బేబమ్మ చేస్తుంది అనుకుంటే తప్పే అంటోంది. స్టోరీ డిమాండ్ చేయాలి కానీ బోల్డ్ సీన్లు కూడా చేస్తాను అంటోంది కృతిశెట్టి.  అలా ఎందుకు చేయకూడని కూడా ఆమె ప్రశ్నిస్తోంది. ఒక సినిమాలో యాక్షన్ సీన్లు ఎలా చేస్తారో అలాగే బోల్డ్ సీన్లు కూడా చేస్తారు.

రెండూ కూడా స్టోరీని బట్టే చేస్తారు. ఏ సీన్ చేసినా ఒకే కష్టం ఉంటుంది. అలాంటపుడు బోల్డ్ సీన్లు అంటే చెడ్డ అని ఎందుకు అనుకోవాలి అంటూ బేబమ్మ సూటిగానే క్వశ్చన్ చేస్తోంది. తన వరకూ అయితే సినిమా స్టోరీయే ఇంపార్టెంట్ అంటోంది.

అంటే బోల్డ్ సీన్లు ఆ స్టోరీలో కనుక ఉంటే. కధ డిమాండ్ చేస్తే తప్పకుండా తాను చేసేందుకు రెడీ అంటోంది కృతి. అయితే ఇక్కడే కండిషన్లు అప్లై అని కూడా చెబుతోంది. స్టోరీకి అవసరం అనుకుంటేనే అంటోంది. అలా అనిపిస్తే తాను చేసేందుకు ఏ మాత్రం వెనకాడబోనని చెబుతోంది.

ఇదిలా ఉంటే ఉప్పెన సూపర్ హిట్ అయింది. కొన్నాళ్ల పాటు బేబమ్మ గురించి బాగా మాట్లాడుకున్నారు. ముద్దబంతి పువ్వులా అచ్చమైన పల్లెటూరు అందంగా ఈ మూవీలో కనిపించిన కృతి కి వరసబెట్టి అవే రోల్స్ ఆఫర్ చేస్తున్నారు అంటున్నారు.

ఇలాగైతే స్టార్ హీరోయిన్ రేసులో దూసుకురావడం కష్టమనే బేబమ్మ  అందాల ఆరబోతకు రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని టాక్. మరి బేబమ్మ రెడీ అంటోంది కాబట్టి మేకర్స్ ఆలోచనలు కూడా మారవచ్చేమో. ఆమెకు హాట్ బేబీ రోల్స్ ని ఫ్యూచర్ లో ఇవ్వవచ్చేమో.

ఎంతసేపూ ట్రెడిషనల్ లుక్ తోనే కాదు, బోల్డ్ గానూ అదరగొడుతాను అంటున్న బేబమ్మను అలా చూడాలనుకునే ఫ్యాన్స్ మాత్రం  వెయిట్ చేయాల్సిందే. అలాంటి  హాట్ క్వీన్ గా ఆమెను ఇప్పటికైతే ఊహల్లో చూసుకోవాల్సిందే. చాన్స్ వస్తే మాత్రం బోల్డ్ బేబమ్మే అవుతుందిట మరి.
Tags:    

Similar News